దక్షిణ ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇంట్లో తల్లి, చెల్లి, నాన్నమ్మ , తండ్రిని పదునైన ఆయుధంతో దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో ఇంటిల్లిపాది ఒక్కోరు ఒక్కో రూమ్ లో రక్తపు ముడుగులో పడి శవాలుగా మారిపోయారు. ఈ సీన్ ను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ యువకుడు కుటుంబ సభ్యులను అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు? దీని వెనుక ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ ఢిల్లీలోని పాలంలో దినేష్, దర్శన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కొడుకు కేశవ్ తో పాటు కూతురు ఊర్వశి ఉన్నారు. వీరితో పాటు దినేష్ తల్లి దేవాన దేవి కూడా ఉండేది. అలా వీరి కుటుంబం సంతోషంగా ఉండేది. అయితే కేశవ్ గతంలో ఓ కంపెనీలో జాబ్ చేసేవాడు. ఇక డ్రగ్స్ కు అలవాటు పడ్డ కేశవ్ దీపావళి నుంచి ఉద్యోగం మానేశాడు. ఇక కేశవ్ అప్పటి నుంచి ఇంటి వద్దే ఉండేవాడు. అయితే డగ్స్ అలవాటులో ఉన్న కేశవ్ ఎలాంటి దారుణాలకైన ఒడిగట్టేవాడని స్థానికులు తెలిపారు. ఇక ఇందులో భాగంగానే కేశవ్ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. గత రాత్రి సుమారు 10. 30 ని.ల ప్రాంతంలో కేశవ్ పదునైన ఆయుధంతో ఇంట్లో ఉన్న నాన్నమ్మ, తండ్రి, తల్లి, చెల్లిని అందర్నీ కత్తితో నరికి చంపాడు. కేశవ్ దాడిలో ఒక్కోరో ఒక్కో రూమ్ లో శవాలుగా మారిపోయారు.
వీరి ఇంట్లో అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చారు. కానీ అప్పటికే వారి నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో వెంటనే స్పందించిన కేశవ్ బంధువులు, స్థానికులు నిందితుడు అయిన కేశవ్ ను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేశవ్ ను అదుపులోకి తీసుకుని మృతదేహాలను పరిశీలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు డ్రగ్స్ కు అలవాటు పడే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.