దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఇదంతా నిందితుడి కొడుకు వీడియో తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ రోజుల్లో అమ్మాయిలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతోంది. ఆడ పిల్ల బయట అడుగు పెడితే చాలు.. కొందరు మగాళ్లు కాస్త మృగాలుగా మారి కామంతో ఊగిపోతున్నారు. ఇక చివరికి ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, ఆపై అత్యాచారాలు చేస్తూ ఎవరూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. ఇదిలా ఉంటే, 68 ఏళ్ల వృద్ధుడు ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఇదంతా అతని కుమారుడు వీడియో తీసి అతని బండారాన్ని బయటపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రాంతంలో తన కొడుకుతో పాటు 68 ఏళ్ల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. వీరుంటున్న ప్రాంతంలోనే ఓ 16 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. అయితే, ఈ 68 ఏళ్ల వృద్ధుడు ఆ బాలికపై కన్నేశాడు. ఎలాగైన ఆ అమ్మాయితో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 20 ఆ వృద్ధుడు ఆ బాలికను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇదంతా అతని కుమారుడు గమనించాడు. ఆ బాలికను తీసుకెళ్లి నా తండ్రి క్షుద్రపూజలు చేస్తున్నాడేమోనని ఆ యువకుడు అనుమానించాడు. ఎలాగైన నా తండ్రిని పట్టుకోవాలని ఆ వృద్దుడి కుమారుడు అతను ఉన్న రూమ్ లో సీక్రెట్ గా మొబైల్ లో వీడియో ఆన్ చేసి వెళ్లిపోయాడు.
ఒక గంట తర్వాత అతడు వచ్చి ఆ వీడియో రికార్డ్ ఆఫ్ చేశాడు. మా నాన్న ఏం చేశాడోనని అతని కుమారుడు ఆ వీడియోను చూడగా.. ఆ వృద్ధుడు ఆ బాలికను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. దీనిని చూసి ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇదే వీడియోను అతడు ఆ బాధిత బాలిక తండ్రికి పంపాడు. ఇది చూసిన ఆ బాలిక తండ్రి నమ్మలేకపోయాడు. వెంటనే ఆ వీడియోను పోలీసుల వద్దకు తీసుకెళ్లి ఆ తర్వాత ఈ దారుణంపై ఫిర్యాదు చేశాడు. ఇక వీడియో బయటకు రావడంతో బాధిత బాలిక సైతం జూన్ 27న జరిగిందంతా పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన ఆ 68 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారింది.