అతిగా మద్యం తాగొచ్చి భార్యలను వేధించిన భర్తలను చూశాం. కానీ భార్య తాగొచ్చి భర్తను వేధించిన స్టోరీలను ఎప్పుడైన విన్నారా? ఇప్పుడు మీరు చదవబోయేది అదే వార్త. అవును మీరు విన్నది నిజమే. ఫుల్ గా తాగొచ్చి భర్తను వేధిస్తూ ఇంట్లో నానా రచ్చ చేసింది ఓ భార్య. దీంతో భార్య వేధింపులను భరించలేని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల దక్షిణ ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఢిల్లీలోని మైదాన్ గర్హి పరిధిలోని అసోలా గ్రామం.
ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్యతో పాటు అతని సోదరుడితో నివాసం ఉండేవాడు. భర్త మార్కెట్లో కూరగాయాలు విక్రయిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుండేవాడు. అయితే అతని భార్య మాత్రం ఫుల్ గా మద్యానికి అలవాటు పడి రోజు తాగొచ్చేది. ఇంతటితో ఆగకుండా భర్తను వేధించడం కూడా చేసేది. దీంతో ఇన్నాళ్లు భరించిన భర్త భార్య వేధింపులను తట్టుకోలేకపోయాడు. ఇటీవల కూడా భార్య తాగొచ్చి భర్తను వేధించింది. ఇక భర్త సహించలేకపోయాడు. ఎలాగైన తన భార్యను హత్య చేయాలని ప్లాన్ గీశాడు.
ఇది కూడా చదవండి: Karnataka: వీళ్లు ప్రపంచాన్ని మరిచి ప్రేమించుకున్నారు.. కానీ పరువు కోసం పెద్దలు ఒకటే మాట చెప్పారు!
ఇందులో భాగంగానే తన తమ్ముడి సాయంతో భార్యను అడవిలో తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్ కు వెళ్లి నా భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భర్త పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఏం జరిగిందంటూ పోలీసుల స్టైల్లో విచారించే సరికి భర్త అసలు విషయాలు భయటపెట్టాడు. దీంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.