రూ. 500 నోటుపై జరిగిన గొడవ..ఒకరిని హత్య చేసేవరకు దారితీసింది. ఇలాంటివి మాములేగా అందామా! అనలేం. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో విస్తుపోయే విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసింది నలుగురు మైనర్లు అయితే.. ఎందుకు చేసార్రా? అని ప్రశ్నిస్తే.. మేము డాన్ గా ఎదగాలనుకున్నాం, అందుకే లేపేశాం అని హుందాగా చెప్తున్నారట.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భజన్‌పురాలోని సుభాష్ మొహల్లా ప్రాంతానికి చెందిన షాపు ఓనర్ షానవాజ్, గురువారం రాత్రి కత్తిపోట్లకు గురయ్యాడు. అపస్మారకంగా నేలపై పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం నుండి నలుగురు బాలురు హడావుడిగా స్కూటీపై అక్కడి నుంచి పారిపోవడాన్ని గమనించారు.
ఆపై ఆ బాలురను భజన్‌పురా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. విచారణ మొదలుపెట్టగా అసలు నిజం బయటపెట్టారు. తామంటే స్థానికుల్లో భయం పుట్టించాలని, నేరగాళ్లుగా పేరు పొందాలని అనుకున్నామని చెప్పారు. 20 రోజుల కిందట షానవాజ్ షాపులో కొన్ని వస్తువులను ఆ బాలురు కొన్నారు. అప్పుడు వారిచ్చిన రూ.500 నోటు చెల్లదని షానవాజ్ చెప్పడంతో గొడవ జరిగింది. ఆ సమయంలో షానవాజ్‌ను బెదిరించిన బాలురు, అతడికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ షాప్ వద్దకు వెళ్లి అతన్నిను కత్తితో పొడిచి హత్య చేశారు. ప్రస్తుతం వారి నుంచి హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా డాన్ అవ్వాలనే ఉద్దేశ్యంతో హత్యకు వెనుకాడని పిల్లలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: డిగ్రీ చదువుతున్న అనూష.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి!
ఇదీ చదవండి: ప్రేమించాలని వెంటపడ్డాడు.. కాదనడంతో సైకోగా మారాడు!