దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువకుడు గోడపై మూత్ర విసర్జన చేశాడన్న కారణంతో ఓ గ్యాంగ్ కలిసి అందరూ చూస్తుండగా ఆ యువకుడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. ఈ దాడి దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మాల్వియనగర్ లో ఉన్న బీజి మార్కెట్ వద్ద మయాంక్(25) అనే యువకుడు గురువారం సాయంత్రం ఓ ఇంటి గోడపై మూత్ర విసర్జన చేశాడు.
ఇది చూసిన కొందరు స్థానిక యువకులు గ్యాంగ్ గా ఏర్పడి మయాంక్ తో వాగ్వాదానికి దిగారు. ఈ చిన్న గొడవ చినిగి చినిగి పతాక స్థాయికి చేరుకుంది. ఇక ఇంతటితో ఆగకుండా ఆ గ్యాంగ్ ముఠా అందరూ చూస్తుండగా మయాంక్ ను నడీ రోడ్డుపై కత్తులతో వెంటాడి మరీ చంపారు. దాడి చేస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. హత్య అనంతరం దుండుగుల అక్కడి నుంచి తలో దారిలో పరుగులు పెట్టారు.
వెంటనే గమనించిన కొందరు వ్యక్తులు మాయంక్ ను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువకుడు అప్పటికే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు మనీష్, రాహుల్, అశిశ్, సూరజ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
A hotel management student was stabbed to death on road in full public view in #Delhi. The attack was captured on CCTV.
The incident happened at a market in #MalviyaNagar.
Mayank was with a friend at the market when 4-5 people came running towards him with knives: #DelhiPolice pic.twitter.com/fJiVfMDneN
— Hate Detector 🔍 (@HateDetectors) August 12, 2022