మన దేశంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరినీ వదలకుండా పాడు పనికి పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ 6 ఏళ్ల బాలికపై ఓ క్యాబ్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు.
ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు మనుషుల్లా కాకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలను నుంచి వృద్ధుల వరకూ ఎవరినీ వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాలు దేశంలో చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారిపై ఏడాది కాలంగా ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?
దేశ రాజధాని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 6 ఏళ్ల కూతురు ఉంది. ఆ కూతురుని స్థానికంగా ఉండే ఓ స్కూల్ లో జాయిన్ చేశారు. తమ కూతురుని రోజూ స్కూల్ కు తీసుకపోవడం, ఇంటికి తీసుకరావడం కోసం ఓ క్యాబ్ డ్రైవర్ ను మాట్లాడున్నారు. దీంతో ఆ వ్యక్తి ఏడాది కాలంగా ఆ బాలికను స్కూల్ కు తీసుకెళ్తూ ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా ఈ ఏడాది కాలంలో క్యాబ్ డ్రైవర్ అభం, శుభం తెలియని ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. లైంగికంగా వేధిస్తూ ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్ లను తాకేవాడు. అయితే ఇదే విషయం ఆ చిన్నారి ఇటీవల తన తల్లికి వివరించింది. కూతురు మాటలు విన్న ఆ తల్లి.. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్మార్గుడు ఆ క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఏడాది కాలంగా ఆ చిన్నారిని లైంగికంగా వేధించిన క్యాబ్ డ్రైవర్ పాడు పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.