ఓ మహిళ దారుణానికి పాల్పడింది. ఆస్తి కోసం ఏకంగా సొంత అత్తమామలను దారుణంగా హత్య చేసింది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలేం జరిగిందంటే?
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ రాక్షస కోడలు ఆస్తి కోసం తన సొంత అత్తమామలను అతి కిరాతకంగా హత్య చేయించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలో రాధేశ్యామ్ వర్మ అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పని చేసిన ఆయన గతంతో రిటైర్డ్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి రాధేశ్యామ్ భార్యతో పాటు ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతనికి ఓ రవి అనే కుమారుడు కూడా ఉన్నాడు. రాధేశ్యామ్ వర్మ కొడుకుకు గతంలో మోనికా అనే యువతితో పెళ్లి జరిపించాడు. ఇక పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.
ఇక అత్తామామలతో పాటు భర్త పిల్లలతో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. విషయం ఏంటంటే? మోనిక భర్తను కాకుండా మరో యువకుడి ప్రేమాయణాన్ని కొనసాగించింది. భర్త, అత్తమామల కళ్లు గప్పి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చేది. అయితే రాను రాను మోనిక విషపు ఆలోచనలు చేసేది. అత్తామామలు సంపాదించిన ఆస్తిని ఎలాగైన కాజేయాలని చూసింది. ఇదిలా ఉంటే ఇటీవల అత్తమామలు పాత ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇందులో భాగంగానే ముందుగా రూ. 4 లక్షలు అడ్వాన్సుగా కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అత్తమామలు ఇళ్లును అమ్మడం మోనికకు ఇష్టం లేదు.
అయితే అత్తామామల ఆస్తి దక్కాలంటే వారిని ప్రాణాలతో లేకుండా చేయాలని కోడలు పథకం రచించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి తోడుగా ఆమె ప్రియుడి సాయం తీసుకుంది. తాను అనుకున్నట్లే ఆదివారం రాత్రి తన ప్రియుడితో పాటు మరో వ్యక్తిని ముందే ఇంటికి రప్పించుకుంది. అత్తామామలు తిని పడుకున్నాక.. వారి బెడ్ రూంలోకి వెళ్లి ప్రియుడితో కలిసి ఆ వృద్ధ దంపతులను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఇక మరుసటి రోజు ఉదయం ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయి ఉండడంతో కుమారుడు రవి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.
వెంటనే పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితురాలు మోనికా అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆస్తి కోసం అత్తమామలను హత్య చేసిన కోడలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.