ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా మందు బాబులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు.. తాగిన మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం నిండు ప్రాణాన్ని బలికొన్నడాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలో కారోల్ బాఘ్‌లో మున్నా అనే ఓ రిక్ష్మా కార్మికుడు తన స్నేహితుడితో కలిసి చపాతీ తింటున్నాడు. అదే సమయానికి ఆకలి అంటూ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి వచ్చాడు. ఫిరోజ్ అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నాడు. పాపం అని మున్నా అతడికి ఓ రొట్టె ఇచ్చాడు. తనకు మరో రొట్టె కావాలని అడగడంతో ఇవ్వనని అన్నాడు మున్నా. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫిరోజ్ పదునైన కత్తితో మున్నా పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఫిరోజ్ చేసిన పనికి అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే షాక్ తిన్నాడు. వెంటనే తేరుకొని దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.. కానీ అతడు కత్తితో అందరినీ బెదిరించి అక్కడ నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న మున్నాను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిరోజ్ ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చివరికి అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.