Crime News: క్షణికావేశంలో ఓ యువకుడ్ని కొట్టి చంపారు కొందరు వ్యక్తులు. ఏదో విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని మాల్‌వియా నగర్ ఏరియాకు చెందిన 25 ఏళ్ల మాయాంక్ తన స్నేహితుడితో కలిసి బేగంపూర్‌లోని కోట దగ్గర కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఓ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. ఏదో విషయంలో ఆ ఐదుగురికి, మాయాంక్‌కు గొడవ జరిగింది. క్షణాల్లో ఆ గొడవ పెరిగింది.
ఆ వ్యక్తులు మయాంక్, అతడి స్నేహితుడ్ని రాళ్లతో కొట్టసాగారు. రాళ్ల దాడి నేపథ్యంలో మయాంక్, అతడి స్నేహితుడు పరుగులు తీశారు. అయినా నిందితులు వారిని వదల్లేదు. వెంబడించారు. డీడీఏ మార్కెట్ దగ్గర మయాంక్‌ను రౌండప్ చేశారు. స్నేహితుడు ప్రాణ భయంతో పారిపోయాడు. ఐదుగురు నిందితులు మయాంక్‌పై కత్తులతో దాడి చేశారు. రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచారు. జనం గట్టిగా అరస్తూ మయాంక్ దగ్గరకు రావటంతో నిందితులు అక్కడినుంచి పరుగులు పెట్టారు.
మయాంక్ స్నేహితుడు ఇతరుల సహాయంతో మయాంక్‌ను ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మయాంక్ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫొటేజీ వీడియో వైరల్‌గా మారింది. సీసీ కెమెరాలు ఉన్న ప్లేసుకు, హత్య జరిగిన ప్లేసుకు మధ్య ఆకులు ఉండటంతో ఒకరకంగా క్రైమ్ సీన్‌ను బ్లర్ చేసినట్లు వీడియో ఉంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
बीच बाजार 5 लोगों ने कर दी युवक की हत्या, तमाशबीन बनी रही भीड़#Delhi #delhikathug #crime #india pic.twitter.com/zZrv66MD1F
— News Track (@newstracklive) August 12, 2022
ఇవి కూడా చదవండి : నర్సుపై కన్నేసిన కీచక డాక్టర్.. నైట్ డ్యూటీకి రమ్మని!