Crime News: ఈ మధ్య కాలంలో పోలీసులపై సామాన్యుల దాడులు ఎక్కువయిపోయాయి. పోలీసులు కొంచెం అతి చేసినా.. చావకొడుతున్నారు కొందరు. తాజాగా, ఓ పోలీస్‌పై కొంతమంది దాడి చేశారు. అది కూడా పోలీస్ స్టేషన్లోనే జరగటం గమనార్హం. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగస్టు 3వ తేదీన న్యూఢిల్లీ, ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌లోకి 10-12మంది వ్యక్తులు దూసుకు వచ్చారు. ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఓ వ్యక్తి కానిస్టేబుల్‌ను తిడుతూ.. కొడుతూ ఉన్నాడు. కానిస్టేబుల్ వదిలేయమని ప్రాథేయపడినా వారు వినలేదు.
కానిస్టేబుల్‌ను కొడుతున్న దృశ్యాలను దాడి చేయటానికి వచ్చిన వారిలో కొంతమందితో పాటు.. అక్కడే స్టేషన్‌లో ఉన్న ఓ కానిస్టేబుల్ కూడా వీడియో తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులెవరైనా సరే పట్టుకుని తీరతామని, వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ఆ వ్యక్తులు ఆ కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారన్నది మాత్రం తెలియరాలేదు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : యువకుడితో చాటింగ్! తల్లిదండ్రులు కూతురిని అలా చూసి!