ప్రస్తుతం సమాజంలో హత్యలు, అత్యాచారాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. ఎంత కఠిన చట్టాలు తీసుకువచ్చినా భయ పడటం లేదు నేరస్తులు. విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బీజేపీ నాయకుడిపై కాల్పులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి రోజు మాంసాహారం.. దాడులు చేసుకున్న విద్యార్థులు..
ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని జీతూ చౌదరీగా గుర్తించారు. మయూర్ విహార్ జిల్లా బీజేపీ యూనిట్‌కు జీతూ చౌదరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఇతడు మయూర్ విహార్ ప్రాంతంలోని ఫేజ్ 3లో నివసిస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జీతూ చౌదరీ తన ఇంటి బయటకు వచ్చి నిల్చున్నాడు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇదరు దుండగులు జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో జీతూ కడుపు, తల భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.
ఇది కూడా చదవండి: హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత.. ఢిల్లీలో భారీగా పోలీసుల మోహరింపు!
ప్రమాదంలో గాయపడిని జీతూని గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో నోయిడా మెట్రో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జీతూ మృతి చెందాడన్న విషయం తెలిసిన వెంటనే స్థానిక బీజేపీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.