ప్రస్తుతం సమాజంలో అనేక మోసాలు జరుగుతున్నాయి. మనం నిత్యం వాటి గురించి వింటున్నాం.. ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయి. కొందమంది అనేక విధాలుగా వలవేసి మోసం చేస్తున్నారు. ఇదే కోవలో ‘ఫేక్’ అమ్మాయి మాట్లాడిన తీపి మాటలకు పడిపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏకంగా రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఓ యువకుడు పనిచేస్తున్నాడు. అతనికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. అందమైన డీపీతో ఖాతా ఉండటంతో ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. తాను ఏపీలోని గుంటూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని ఆ మాయలేడి పరిచయం చేసుకుంది.
అంతే అక్కడి నుంచి ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా చాటింగ్ కొనసాగింది. ఇరువురు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. కొన్నాళ్లు ఫోన్ సంభాషణలు బాగానే జరిగాయి. సండన్ గా ఓ రోజు ప్రేమిస్తున్నాని అమ్మాయి చెప్పడంతో అతను అంగీకరించాడు. ఈ క్రమంలో తనకు అత్యవసంరగా డబ్బు అవసరమని ఆమె చెప్పింది. కొంత డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ విధంగా రూ.95 లక్షలు అతని నుంచి విడతల వారిగా కాజేసింది. అనంతరం ఫేస్ బుక్ నుంచి తన ఖాతాను తొలగించి, ఫోన్ నంబర్ బ్లాక్ చేసింది. తీరా తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.