పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా రోజు కేసులు బయటపడుతూనే ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతూనే వున్నారు. హైదరాబాద్‌లో ఫారెస్ట్ ఆయిల్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఆయిల్ పేరుతో రూ.11 కోట్ల మేర బాధితులకు టోకరా పెట్టారు కేటుగాళ్లు. ఫేస్‌బుక్‌తో గీతా నారాయణ్ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ట్ చేస్తున్నట్లు నమ్మించారు. వ్యాక్సిన్ తయారయ్యే అగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు విడతల వారీగా రూ.11 కోట్లను ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత మోసం గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశువుల వ్యాక్సిన్ తయారీకి ఉపయోగపడే ఆయిల్ పంపుతామంటూ ముఠాగా ఏర్పడి రూ.11.90 కోట్లు దోచుకున్నారు. తమ వద్ద పశువుల వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించే అగ్రోమెటిజమ్ ఆయిల్ తక్కువ ధరకు దొరకుతున్నదని, దానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుందని చెప్పింది. మరోవైపు, తాము ఆ యిల్ కొంటామని బెంజిమెన్ పేరిట ఒక వ్యక్తి సీవీరావుకు మెయిల్ పంపించాడు. ముంబయిలో లీటర్ ఆయిల్ రూ.10.8లక్షలకు దొరుకుతుందని, తాము అమెరికా, లండన్‌లో రూ.16.3 లక్షలకు కొంటామని బెంజిమెన్ నమ్మించాడు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో తమ ప్లాంట్ ఉన్నదని అక్కడినుంచి ఆయిల్ పంపిస్తామని గీతా నారాయణ ద్వారా పరిచయమైన లక్ష్మి అనే మహిళ సీవీరావుతో మాట్లాడింది. ఆయన ఒక లీటర్ ఆయిల్‌కు ఆర్డర్ ఇచ్చారు. కనీసం 350 లీటర్లు ఇస్తే ఒక బ్యాచ్ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవచ్చని ఆశ పుట్టించారు. ఇది తమకూ కలిసి వస్తుందని నమ్మించారు. కొరియర్‌లో ఆయిల్ పార్సిల్ వస్తుందని నమ్మబలికారు. సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు సీవీరావు తన బ్యాంకు ఖాతా నుంచి డాలర్ల రూపంలో దుబాయ్‌లో ఉన్న మూడు, అమెరికాలో ఉన్న ఆరు బ్యాంకు ఖాతాలకు రూ.11.9 కోట్లకు పైగా పంపించారు.
పూర్తి డబ్బు చెల్లిస్తేనే ఆయిల్ వస్తుందని, దానికి వ్యాట్, ఇతర బిల్లులు చెల్లించాల్సి ఉ న్నదని ఇంకో 2.50 లక్షల డాలర్లు కావాలని నేరగాళ్లు ఒత్తిడి తెచ్చారు. మోసపోయినట్టు తెలుసుకున్న బాధితులు సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు ఈమెయిల్స్ పంపి, ఇంత భారీఎత్తున మోసం చేసిన ఘటన రాష్ట్రంలో ఇదే మొదటిది.