ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దొరికిన కాడికి దోచేస్తున్నారు. చదువు రాని వాళ్లే అనుకుంటే చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడిపోతున్నారు.
ఒకప్పుడు దొంగలు ఇళ్లు, దుకాణాలు వంటి వాటిల్లో చోరీలు చేసేవారు. అయితే కాలంతో పాటు దొంగలు అప్ డేట్ అవుతున్నారు. అందరూ ఆన్ లైన్ లో నగదు బదిలీ చేస్తుండటంతో దొంగలు ఆ బాట పట్టారు. ఈక్రమంలోనే ఇటీవలే సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా సైబర్ కేటుగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఇప్పటికే అనేక మంది మోసపోయారు. చదువు రాని వాళ్ళే అనుకుంటే చదువుకున్న వాళ్లు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. తాజాగా సైబర్ మాయగాళ్ల వలలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చిక్కుకున్నాడు. వారి మాటలు నమ్మి లక్షల్లో డబ్బులు పోగట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ కు చెందిన సకల్ దేవ్ సింగ్ అనే వ్యక్తి హనుమకొండ జిల్లాలోని పరకాల ఎస్బీఐ మొయిన్ బ్రాంచ్ లో అస్టిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి ఆయనకు ఓ మొబైల్ నెంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. మీ అకౌంట్ డీ యాక్టివేట్ అవుతుంది… పాన్ కార్టు అప్ డేట్ చేయండి అని అందులో ఉంది. ఆయన బిజీగా ఉండి గురువారం చూసుకోకుండా తిరిగి శుక్రవారం ఉదయం ఆ మెసేజ్ పై క్లిక్ చేశారు. అయితే ఆ సమయంలో అప్ డేట్ చేయడానికి ప్రయత్నించగా .. సబ్ మిట్ కాలేదు. కొద్ది సమయం తరువాత మరొక నంబరు నుంచి సకల్ దేవ్ సింగ్ కు ఫోన్ వచ్చింది. మీ పాన్ కార్డును అప్ డేట్ చేయడానికి తాను చెప్పినట్లు చేయమని అవతిలి వ్యక్తి సూచించగా.. తాను బస్సులో ఉన్నానని తరువాత చేస్తానని సకల్ దేవ్ తెలిపాడు.
బ్యాంకుకు వెళ్లిన తరువాత ఆయనే తనకు వచ్చిన నెంబర్ కు తిరిగి కాల్ చేశారు. అవతలి వ్యక్తి తాను ఓ లింక్ పంపిస్తున్నానని, దానికిపై క్లిక్ చేస్తే.. మీ అకౌంట్ యాక్టీవేట్ అవడంతో పాటు, పాన్ కార్డు అప్ డేట్ అవుతోందని చెప్పాడు. అతడు చెప్పినట్లు తన ఫోన్ కు వచ్చిన ఓ లింక్ పై సకల్ దేవ్ సింగ్ క్లిక్ చేశాడు. దీంతో క్షణాల్లో ఆయన అకౌంట్ నుంచి వరుసగా రూ.99, 990, రూ.99,990, రూ.24,987 విత్ డ్రా అయ్యాయి. తాను మోసపోయినట్లు గ్రహించిన సకల్ దేవ్ సింగ్ శుక్రవారం రాత్రి పరకాల పోలీసులక ఫిర్యాదు చేశారు. వారు సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరి.. సైబర్ నేరగాళ్ల గురించి తెలిసిన వాళ్లే ఇలా మోసపోవడంపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.