ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. కొంత మంది మోసాలు చేసి సంపాదిస్తుంటే.. మరికొంత మంది అదే మోసానికి బలి అవుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అన్న కాన్సెప్ట్ తో కొంత మంది కేటుగాళ్ళు అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని సైబర్ కేటుగాళ్ళు బాధితుడిని నమ్మించి లక్షల్లో టోపీ పెట్టారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఓ వ్యక్తికి కొంత మంది వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యారు. అతనికి ఈజీ మనీ సంపాదించే మార్గాలు చూపిస్తామని.. అందుకోసం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితో అత్యధికంగా లాభాలు పొంద వొచ్చని.. మొదట బాధితుడికి లాభాలు చూపించారు. వారి మాటలు పూర్తిగా నమ్మిన బాధితుడు లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిన వ్యక్తి నుంచి డబ్బు తీసుకోడానికి కమిషన్, చార్జీలు పేరుతో రూ. 96 లక్షలు కాజేశారు.
ఇది తెలియని ఆ వ్యక్తి వాళ్లు అడిగినంత డబ్బు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తను దారుణంగా మోసపోయానని లబోదిబో అంటున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం సైబర్ మోసగాళ్ళు ఎక్కువ అయ్యారని.. డబ్బు ఇన్వెస్ట్ చేసే సమయంలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని పోలీసులు అంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.