crime news : ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలు తనతో సరిగా ఉండటం లేదని, దూరం పెడుతోందని ఓ యువకుడు కలత చెందాడు. ప్రేయసి చెంత లేని ప్రాణం తనకెందుకు అనుకున్నాడు. ఆమె ఇంటి ముందే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌లోని కొత్వాలి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల నజీమ్, అదేప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, గతకొద్దిరోజులుగా ఆ యువతి నజీమ్‌కు దూరంగా ఉంటోంది. సరిగా మాట్లాడటం లేదు. ఈ విషయమై ఇద్దరకీ గొడవలు కూడా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నజీమ్ ప్రియురాలి ఇంటి దగ్గరకు వెళ్లాడు. 3.10 గంటల ప్రాంతంలో బయటినుంచి ఆమెకు ఫోన్ చేశాడు. ఎమైందో తెలియదు. ఆ తర్వాత ప్రియురాలి ఇంటి ముందు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళుతున్న జనం రోడ్డుపై ఉన్న శవాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదుచేసుకుని దర్యాపు చేస్తున్నారు. నజీమ్‌ది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికి హత్య కోణంలోనూ విచారణ చేస్తున్నారు. నజీమ్ ప్రియురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : లవర్‌తో వీడియో కాల్.. లైవ్‌లో ఉరి డ్రామా.. పాపం విధి వక్రించి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.