Crime news : డీఎంకే ఎంపీ, రాజ్యసభ సభ్యుడు ఎన్‌ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ ఈ (గురువారం) ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాకేష్, అతడి స్నేహితుడు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొట్టకుప్పం ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాకేష్ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రాకేష్, అతడి స్నేహితుడు పుదుచ్చేరి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.
కారు పల్టీలు కొట్టడంతో రాకేష్ అక్కడికక్కడే మృతిచెందాడని వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఓ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుందని, కారును కోసి అందులో ఇరుక్కుపోయిన రాకేష్ మృతదేహాన్ని బయటకు తీశామని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ రాకేష్ స్నేహితుడ్ని పుదుచ్చేరికి సమీపంలోని కనగచెట్టిపురం వద్దనున్న పుదుచ్చేరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించామని తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పెళ్లై 20 రోజులు.. మరిదిని ప్రేమించింది.. అందరూ షాక్ అయ్యేలా..
పోర్న్ చూసి రెచ్చిపోయారు.. పొలంలోని బాలికలపై..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.