crime news : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళ ఎంత వద్దంటున్నా వినకుండా వెంట పడటంతో ఆమె కుటుంబీకులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం మండలం గశికవారిపల్లి గ్రామానికి చెందిన 55 ఏళ్ల బలపనూరు రామాజంనేయులు అదే గ్రామానికి చెందిన మహిళతో 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవటంతో ఈ సంబంధం మహిళకు ఇబ్బందిగా మారింది.
దీంతో ఐదు సంవత్సరాలనుంచి అతడికి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే, ఆమె తనకు దూరంగా ఉండటం అతడికి నచ్చలేదు. ఈ నెల 6వ తేదీన మహిళ ఇంటి దగ్గరకు వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. సంబంధానికి ఒప్పుకోలేదన్న కోపంతో బాగా కొట్టాడు. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు రవి, సోదరుడు రమేష్, మరిది ధనుంజయ.. రామాంజనేయులుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : యాక్సిడెంట్ లో భర్త మృతి! పోలీసులు కూడా ఊహించని ట్విస్ట్!
పెళ్లై 20 రోజులు.. మరిదిని ప్రేమించింది.. అందరూ షాక్ అయ్యేలా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.