Crime News: భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. గొడవలు పడ్డంత మాత్రాన విడిపోవాలన్న రూలేమీ లేదు. ఒక వేళ విడిపోవాల్సి వస్తే.. రెండు వైపుల నుంచి అంతే దూరాన్ని కోరుకోవాలి. ఒకరు బంధంలో ఉండాలని, మరొకరు దూరంగా ఉండాలని అనుకుంటే మాత్రం తేడాలు వస్తాయి. ఇష్టంలేని ఆ వ్యక్తి బయటకు వచ్చి వేరే పెళ్లి చేసుకుంటే.. ఇష్టం ఉన్న వ్యక్తి జీవితం అంథకారంగా మారుతుంది. ఆ అంథకారంలో ప్రాణాలు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా, ఓ వ్యక్తి తన భార్య రెండో పెళ్లి చేసుకుందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందో సూసైడ్ నోట్ రాశాడు. అందులోని ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి తన శవాన్ని అక్కడ అప్పజెప్పాలని కోరాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నెహ్రూ నగర్‌కు చెందిన ఉమేశ్ అలియాస్ మున్నా ఫాదర్ యశ్‌రాజ్‌కు 2018లో ఉజ్జయిన్‌కు చెందినరేణుతో పెళ్లయింది. కొన్ని నెలలు సక్రమంగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఉమేష్ భార్య రేణుతో గొడవల కారణంగా 2019నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. 2020లో ఉమేష్ తనపై గృహహింసకు పాల్పడ్డాడని రేణు ఆరోపించింది. దీంతో ఇద్దర మధ్యా దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం రేణు గురించి ఓ విషయం తెలిసింది. ఆమె రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఇక అప్పటినుంచి ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటున్నాడు. తీవ్ర ఒత్తిడికి కూడా లోనయ్యాడు. బాద్‌నగర్‌లో పనిచేస్తున్న అతడు ఇండోర్‌కు వచ్చేశాడు. అయితే, పనిలోకి రావాలంటూ బాద్‌నగర్‌నుంచి చాలా ఫోన్లు వచ్చాయి. కానీ, అతడు తిరిగివెళ్లలేదు. భార్య శాశ్వతంగా తనకు దూరం అయిందన్న బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆధార్ కార్డు వెనకాల ఓ ఫోన్ నెంబర్‌తో పాటు, ‘నా చావు వార్తను ఈ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి!’ అని రాశాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Road Accident: హైదరాబాద్ వస్తున్న బస్సులో చెలరేగిన మంటలు.. 8మంది మృతి!