స్నేహితుడు బాగుపడతాడని డబ్బులిస్తే ఓ యువతిని హతమార్చాడో దుర్మార్గుడు. ప్రేమ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తూ.. అందిన కాడికి దోచుకునే మోసానికి పాల్పడేవాడు మరొకరు. నమ్మకమే పెట్టుబడి అన్న చందంగా.. నమ్మించి.. వంచించి.. ఆపై గొంతు కోస్తున్నారు మానవ మృగాళ్లు.
ఎవరి నమ్మాలో ఎవ్వరినీ నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. స్నేహితుడు బాగుపడతాడని డబ్బులిస్తే ఓ యువతిని హతమార్చాడో దుర్మార్గుడు. ప్రేమ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తూ.. అందిన కాడికి దోచుకునే మోసానికి పాల్పడేవాడు మరొకరు. నమ్మకమే పెట్టుబడి అన్న చందంగా.. నమ్మించి.. వంచించి.. ఆపై గొంతు కోస్తున్నారు మానవ మృగాళ్లు. మగవారిని ఆడవాళ్లు నమ్మడమే తప్పు అనిపించేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అందాల సుందర నగరమైన విశాఖలో మరో దారుణం నెలకొంది. ప్రేమించిన వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్యచేశాడో ప్రేమికుడు.
వివరాల్లోకి వెళితే.. విశాఖలోని పరవాడకు చెందిన గోపాల కృష్ణ, శ్రావణి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ జగదాంబలోని ఓ షాపింగ్ మాల్లో పని చేస్తున్నారు. కాగా, శ్రావణికి గతంలోనే వివాహమైనట్లు సమాచారం. అయితే ఈ తెల్లవారు జామున ఇద్దరు బీచ్‌కు వెళ్లారు. ఏదో విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. శ్రావణి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, హత్య చేసిన అనంతరం గోపాలకృష్ణ గాజువాక పోలీసు ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.