స్నేహం ముసుగులో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. స్నేహితులను చెడు సావాసాలకు లోను చేస్తూ.. జీవితాలను అయోమయం, గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నారు. దీనికి తోడు ప్రేమ వ్యవహారం కూడా కొంపలు ముంచుతోంది.
ప్రపంచంలో అందమైన బంధాల్లో ముందు వరుసలో ఉండేది స్నేహం. మంచి స్నేహితుడు..మంచి పుస్తకం లాంటి వాడు. ఎవ్వరికైనా నా అనేవాళ్లు, బంధువులు లేని వాళ్లు ఉంటారేమో కానీ స్నేహితులు ఉండని మనుషులు ఉండరు. కానీ నేడు స్నేహం ముసుగులో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. స్నేహం, ప్రేమ మత్తులో జీవితాలను అయోమయం, గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నారు. స్నేహితుడి పార్టీకి వెళ్లి వస్తానన్న కుమారుడు.. విజయవాడ శివారులో ఉన్న పెదపులిపాకలో కాలిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలి చేరుకుని పరిశీలించారు.
విజయవాడ శివారు ప్రాంతమైన పెదపులి పాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడ్ని పెట్రోల్ పోసి తగులబెట్టిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా.. మృతుడు జీవన్ కుమార్‌గా గుర్తించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విజయవాడ వన్ టౌన్ లో ఉన్న పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడవ సంవత్సరం చదువుతున్నారు జీవన్. కృష్ణా జిల్లా వల్లూరు పాలెంకు చెందిన జీవన్ కుమార్ విజయవాడ మాచవరం ప్రాంతంలో ఉంటున్నాడు. ఏ రాత్రైనా ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా కనిపించే సరికి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగి తేలుతున్నారు.
మంగళవారం రాత్రి శ్యామ్ అనే తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా పార్టీకి వెళ్లాడు జీవన్ కుమార్. ఆ తరువాత పెదపులిపాక పంట పొలాల్లో మృతదేహంగా కనిపించాడు. కాలిన స్థితిలో కనిపించాడు. పార్టీకి వెళ్లి వస్తానన్న కుమారుడు విగత జీవిగా కనిపించే సరికి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. రాత్రి ఇంటికి రాకపోయే సరికి ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పాడని తండ్రి సుధాకర్ తెలిపారు. రాత్రి ఫోన్ చేసి తండ్రికి ఆరోగ్యం బాగోదని, సరిగ్గా చూసుకోవాలని చెప్పినట్లు తల్లి నాగమణి కన్నీటి పర్యంతమైంది. ఏమైందీ అని అడిగితే.. సమాధానం చెప్పలేదని, తెల్లార్లు ఫోన్ చేస్తూనే ఉన్నానని, కానీ ఎత్తలేని చెప్పింది.
ఆ తరువాత పోలీసులు ఫోన్ చేశారని, ముందుగా బండిని పట్టుకున్నారేమోనని అనుకున్నానని తండ్రి తెలిపారు. స్నేహితులు మూలంగానే తన కుమారుడు ఇలా అయ్యాడంటూ ఏడ్చేశాడు. మంగళవారం జరిగే ఎగ్జామ్ కు కూడా హాజరు కాలేదని లెక్చరర్ ఫోన్ చేసి చెప్పడంతో తమకు విషయం తెలిసిందన్నారు. కాసేపట్లో జీవన్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగబోతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేపట్టాడు. ప్రాథమిక విచారణలో ఇది హత్యగా తేల్చారు. ఇందులో ప్రేమ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. యువతిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. జీవన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. స్నేహితులను విచారిస్తున్నారు.