crime news : భార్యపై అనుమానాలతో దారుణానికి ఒడిగట్టాడో భర్త. మాట్లాడుకుందాం రమ్మని హోటల్ గదికి పిలిచి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఈ సంఘటన విజయవాడలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల ప్రసాదరావుకు కంచికచర్లకు చెందిన షారోన్ పరిమళకు 2015లో పెళ్లయింది. కొంతకాలం వీరి కాపురం సక్రమంగానే సాగింది. ఆ కొద్దిరోజులకే ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయి. ప్రసాదరావు తరచూ ఆమెను అనుమానిస్తూ ఉండేవాడు. అక్రమ సంబంధం పెట్టుకుందనేవాడు. శారీరకంగా, మానసికంగా ఆమెను హింసించే వాడు. దీంతో పరిమళ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టారు.
ఆమెను బాగా చూసుకుంటానని చెప్పి, కాపురానికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మొదటికి వచ్చాడు. ఆమెను హింసించటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అప్పటినుంచి భర్తతో విడిగా ఉంటూ విజయవాడలోని ఓ ఆసుపత్రిలో పని చేస్తోంది. ప్రసాద్ రావు తర్వాత దుబాయ్ పోయాడు. గత జనవరిలో తిరిగి వచ్చాడు. ఆదివారం భార్యను నమ్మించి విజయవాడ అశోక హోటల్‌కు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు భార్యభర్తలమని చెప్పి ఇద్దరూ రూం తీసుకున్నారు.
అర్థరాత్రి 2 గంటల టైంలో భార్యకు జ్యూస్ తేవడానికి కనిచెప్పి ప్రసాదరావు బయటకు వెళ్లాడు. జ్యూస్ తీసుకుని గదిలోకి వెళ్లిపోయాడు. తర్వాత కొద్దిసేపటికే భార్యకు జ్యూస్ నచ్చలేదంటూ మళ్లీ బయటకు వెళ్లిపోయాడు. ఈ సారి తిరిగిరాలేదు. హోటల్ సిబ్బంది ఒకరు ఉదయం 5 గంటలకు రూం తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు. బెడ్ మీద కప్పిన దుప్పటి తీసి చూడగా పరిమళ గొంతు కోయబడ్డ స్థితిలో శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, అదే రోజు రాత్రి ప్రసాద్‌రావు కంచికచర్ల పోలీసుల ముందు లొంగిపోయాడు. వారు అతడ్ని గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దారుణ హత్య.. గ్రౌండ్ లోనే!
భార్యని కలెక్టర్ చేయాలనుకున్న కూలీ! భార్య మాత్రం కోచింగ్ సెంటర్‌లో..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.