సామాజిక మాధ్యమాలు, ఇతర యాప్స్‌లో మన ఫోటోలు పోస్టింగ్ చేయడం ఆలస్యం.. సైబర్ నేరగాళ్లు.. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు. ఇక డబ్బుల కోసం వేధిస్తూ.. వీటిని కుటుంబ సభ్యులతో పాటు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తుంటారు. లక్షలకు లక్ష్లలు డిమాండ్ చేస్తూ ఉంటారు. వీరి ఆగడాలకు అంతు ఉండదు. టార్గెట్ చేసిన వారిని నిద్ర కూడా పోనియ్యురు.
సెల్ ఫోన్ వచ్చాక అరాచకాలు నానాటికి పెరుగుతున్నాయి. ఈజీ మనీ కోసం సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు. సామాజిక మాధ్యమాలు, ఇతర యాప్స్‌లో మన ఫోటోలు పోస్టింగ్ చేయడం ఆలస్యం.. సైబర్ నేరగాళ్లు.. వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారు. ఇక డబ్బుల కోసం వేధిస్తూ.. వీటిని కుటుంబ సభ్యులతో పాటు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తుంటారు. లక్షలకు లక్ష్లలు డిమాండ్ చేస్తూ ఉంటారు. వీరి ఆగడాలకు అంతు ఉండదు. టార్గెట్ చేసిన వారిని నిద్ర కూడా పోనియ్యురు. పోలీసులకు చెబితే.. చంపేస్తామంటూ బెదిరించడంతో బాధితులు నిస్సహాయ స్థితికి చేరుకుంటున్నారు. దీనితో డబ్బులు ఇవ్వకపోతే పరువు పోతుందన్న భయంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఓ మహిళా అసిస్టెంట్ ప్రొపెసర్ విషయంలో ఇదే జరిగింది. కానీ తీగ లాగితే డొంక కదిలినట్లు.. నేరగాళ్లకు సంబంధించిన మూలాలు ఏపీలో తేలాయి.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మహిళా ప్రొఫెసర్‌కు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్చిన ఆగంతకులు.. ఆమెకు పంపి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. రోజు రోజుకు పెరిగిన వాళ్ల వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వీరి వెనుక ఓ మహిళ ఉందని, ఆమె విజయవాడలో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఆమెను పట్టుకునేందుకు సూరత్ పోలీసులు మారు వేషంలో వచ్చి.. రెక్కీ నిర్వహించి.. చాక చక్యంగా అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సూరత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మహిళా.. బ్యాంకు లోన్స్‌కు సంబంధించిన సమాచారం కోసం ఆమె తన సెల్‌ఫోన్‌లో క్యాష్‌మీ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది.
అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసిన సమయంలో ఆమె ఫోనును హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొత్తం క్లోన్ చేశారు. ఆ తర్వాత ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న వీడియోలు రూపొందించారు. వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె చనిపోయింది. రంగంలోకి దిగిన పోలీసలు…బీహార్‌లోని జాముయి ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితుల అభిషేక్ కుమార్ సింగ్, రోషన్ కుమార్ సింగ్, సౌరభ్ గజేంద్ర కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా.. నలుగురు నిందితులు పేర్లు బయటకు వచ్చాయి. అయితే వారిలో జూహీ సలీం షేక్ ప్రధాన పాత్ర పోషించినట్లు తేలింది. విజయవాడలోని పంజా సెంటర్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. బుర్ఖా ధరించి..రెక్కీ నిర్వహించి.. ఆమెను అరెస్టు చేశారు. విజయవాడలోని కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్న తర్వాత మంగళవారం రాత్రి నిందితురాలిని సూరత్‌కు తీసుకొచ్చారు. జూహీ షేక్ సోషల్ మీడియా ఖాతాలు, జిమెయిల్ ఐడిని తనిఖీ చేయగా, ఆమెకు పాకిస్తాన్‌కు చెందిన జుల్ఫికర్ అనే వ్యక్తితో సంబంధం ఉందని రాండర్ పోలీసులు గుర్తించారు. ఆమె క్రిప్టో కరెన్సీ ద్వారా జుల్ఫికర్‌కు డబ్బు బదిలీ చేసేదని తేల్చారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగుతుంది.