పిల్లలకు పెళ్లి చేసే సమయంలో కచ్చితంగా అమ్మాయి, అబ్బాయి మనస్సు తెలుసుకోవాలి తల్లిదండ్రులు. వారికి అంగీకారమైతేనే పెళ్లి చేయాలి. లేదంటే వారి మనస్సులో మరొకరు ఉన్నారేమో కనుక్కోవాలి. ఎందుకంటే పెద్దలు పెళ్లి చేసి చేతులు దులుపుకుంటారు కానీ, జీవితాంతం సంసారం చేయాల్సిందీ వాళిద్దరూ. రెండు జంటలను కలిపేశాం. ఇక మీ తిప్పలు మీరు పడండి అనడం సబబు కాదూ ఈ రోజుల్లో. జీవితంపై అవగాహన ఉంటున్న నేటి యువత పెళ్లి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తాము అన్నింటికి సిద్ధమైతేనే పెళ్లి చేసకుంటున్నారు. అదీ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. లేదంటే పెళ్లి తర్వాత ఎటు తేల్చుకోలేని పరిస్థితికి చేరకుంటున్నారు. దీని వల్ల తీవ్ర అనార్థాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఈ సంఘటన.
పెళ్లై కొన్ని గంటలు కూడా పూర్తి కాలేదు.. ఏమైందో తెలియదు.. మొదటి రాత్రి కోసం సిద్ధం చేసిన శోభనం గదిలో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అతడు చనిపోగా.. అమాయకురాలైన ఆడ పిల్లను బాధ పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. కనౌజి జిల్లా మాచారియా గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్ కు గోల్డీ అనే యువతీతో గత నెల 26న వివాహమయ్యింది. పెళ్లి తర్వాత అత్తారింట్లో తొలి రాత్రి కోసం గదిని సిద్ధం చేశారు. పాల గ్లాసుతో.. కొత్త పెళ్లికూతరు శోభనం గదిలోకి సిగ్గుల మొగ్గై వెళ్లింది. అంతలో పెళ్లి కుమారుడు మనోజ్.. ఓ నిమిషం అంటూ ఆపాడు. బయటకు వెళ్లారా అని చెప్పడంతో బాత్రూమ్‌కు వెళతాడమో అనుకుని గది బయటకు వచ్చింది.
గది బయటకు వెళ్లగా ఎంత సేపటికీ రాలేదు. తలుపు తట్టినా తీయలేదు. అనుమానం వచ్చి తలుపు బద్ధలు కొట్టి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ షాక్ తిన్నారు. మనోజ్ గదిలో ఫ్యానుకు వేలాడుతున్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త ఆ చుట్టూ ప్రాంతాలు మొత్తం పాకింది. ఈ ఘటనతో పెళ్లికూతురు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతను ఎందుకలా చేశాడో ఇప్పటికీ తెలియ రాలేదు. దీని మీద పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడకి ఈ పెళ్లి ఇష్టంతోనే జరిగిందా లేదా అనేది విచారణ జరుపుతున్నారు.