సినిమాల్లో చూపించిన విధంగా వివాహ బంధమేమీ అందంగా సాగిపోదు. కచ్చితంగా ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఉంటాయి. ఈ సమయంలో ఇద్దరు సమయాన్ని కేటాయించుకుని, సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోతుంది. కానీ
పెళ్లితో భార్యా భర్తల బంధం మొదలవుతుంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దలు కుదిర్చినా వివాహమైనా. అయితే ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడటానికి కొంత సమయం పడుతుంది. దాని కోసం వేచి చూడాలి. సినిమాల్లో చూపించిన విధంగా వివాహ బంధమేమీ అందంగా సాగిపోదు. కచ్చితంగా ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, సుఖ దు:ఖాలు ఉంటాయి. ఈ సమయంలో ఇద్దరు సమయాన్ని కేటాయించుకుని, సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోతుంది. కానీ విషయాన్ని బూతద్దంలో చూసుకుని, గొడవలు పడితే.. పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. ఆలోచన రహితం, ఆవేశం తీవ్రతకు దారి తీస్తున్నాయి. ఇవే ఆత్మహత్యలకు, హత్యలకు పురిగొల్పుతున్నాయి.
పెళ్లి చేసుకున్న ఐదు నెలలకే గొడవలు జరగడంతో ఆవేశంతో భార్యను చంపి, భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో మఖ్యాలి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నసీమ్ మాలిక్ ఐదు నెలల క్రితం నర్గీస్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సద్దాం అనే వ్యక్తి వీరి పెళ్లికి మధ్యవర్తిత్వం వహించాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులకు వీరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కూడా వీరిద్దరూ గొడవపడ్డారు. అయితే ఈ విషయంపై తేల్చుకునేందుకు మధ్యవర్తిగా ఉన్న సద్దాం ఇంటికి వెళ్లారు. అయితే వీరి గొడవను భరించలేక సద్దాం అక్కడి నుండి వెళ్లిపోయాడు.
ఇద్దరినీ శాంతింపజేసేందుకు మధ్యలో సాబీర్ అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. అప్పడిటికే కోపంతో ఊగిపోతున్న నసీమ్.. సాబీర్‌పై కాల్పులు జరిపాడు. అతడు తృటిలో తప్పించుకున్నప్పటికీ గాయపడ్డారు. దీంతో వారిని వారించేందుకు ఎవ్వరూ సాహసం చేయలేదు. సాబీర్‌పై కాల్పులు జరిపిన తర్వాత, నసీమ్ తన బైక్‌పై నర్గీస్‌తో బయలుదేరాడు, కానీ కొంత దూరం వెళ్లాక బండిని ఆపి నర్గీస్‌పై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నసీం గల్ఫ్ దేశంలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, అతడి వివాహ జీవితం సంతృప్తి లేకపోవడంతో ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతిపై విచారణ జరుపుతున్నారు.