అప్పులు ఇచ్చేంత వరకు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అప్పు ఇచ్చాక అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టరు. అదేమని అడిగితే రేపు, మాపు అంటూ అప్పు ఇచ్చిన వాడికి చుక్కలు చూపిస్తుంటారు రుణ గ్రస్తులు. అదీ మనుషులైనా సంస్థలైనా, అడగడానికి వచ్చిన వారిపై దాడి చేస్తుంటారు.
సామాన్యులకు కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. దాని కోసం అప్పులు చేస్తుంటారు. అవసరానికి డబ్బు తీసుకుని సకాలంలో చెల్లించడం బాధ్యత అన్న విషయం మర్చిపోతుంటారు కొందరు. అప్పులు ఇచ్చేంత వరకు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అప్పు ఇచ్చాక అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టరు. అదేమని అడిగితే రేపు, మాపు అంటూ అప్పు ఇచ్చిన వాడికి చుక్కలు చూపిస్తుంటారు రుణ గ్రస్తులు. అదీ మనుషులైనా సంస్థలైనా. అప్పు తిరిగి చెల్లించకపోగా.. అడగడానికి వచ్చిన వారిపై దాడి చేస్తుంటారు అప్పు తీసుకున్నవారు. తాజాగా అటువంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి కానిస్టేబుల్ కావడం గమనార్హం.
బ్యాంకు రుణాన్ని చెల్లించాలని అడిగినందుకు వ్యక్తిని కాల్చి చంపాడో కానిస్టేబుల్. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాలాలో చోటుచేసుకుంది. చనిపోయిన బ్యాంకు ఉద్యోగి భారత సంతతికి చెందిన వాడు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఇవాన్ వార్ వెబ్ అనే కానిస్టేబుల్ ఓ బ్యాంకు నుండి అప్పు తీసుకోగా.. వడ్డీ, అసలుతో కలిపి రూ. 49 వేలు అయ్యింది. అయితే వాటిని చెల్లించడంతో విఫలమయ్యాడు. ఆ అప్పు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారి ఉత్తమ్ భండారీ ఇవాన్‌ను కోరాడు. తాను అంత అప్పులేనని ఇవాన్ చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య చర్చ జరగ్గా.. కోపంతో ఊగిపోయిన ఇవాన్.. ఏకే 47తో భండారీపై పలు మార్లు కాల్పులు జరిపాడు. దీంతో భండారీ అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇవాన్ తన ఏకే-47 రైఫిల్ తో భండారీని కాల్చి చంపిన తర్వాత గన్ ను అక్కడే వదిలి పారిపోయాడని కంపాలా మెట్రోపాలిటన్ పోలీసు ప్రతినిధి, పాట్రిక్ ఒన్యాంగో తెలిపారు. ఘటనా స్థలం నుంచి 13 కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాన్‌కు మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు తెలిపారు. మానసిక క్షీణతతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరిన తర్వాత తుపాకీని కలిగి ఉండకుండా ఐదేళ్ల క్రితం నిషేధం విధించినట్లు చెప్పారు.