Crime News : ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతూ జరుపుకుంటున్న ఆ ఫేర్‌వెల్ పార్టీ ఒక్కసారిగా విషాదంగా మారింది. పార్టీలో అందరూ చూస్తుడగా ఓ యువకుడు టెన్త్ క్లాస్ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూనాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి 2002లో పూనెకు వచ్చి స్థిరపడ్డాడు. టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి ఓ కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె టెన్త్ క్లాస్ చదువుతోంది. వారి ఇంటి పక్కనే ఉంటున్న 22 ఏళ్ల యువకుడు తరచూ ఆ బాలికను వేధిస్తుండేవాడు. దీంతో వారు అక్కడినుంచి ఇళ్లు మారిపోయారు.
అయితే, ఆ యువకుడి కుటుంబం కూడా ఇళ్లు మారింది. ఇక ఆ తర్వాతినుంచి యువకుడు బాలికను వేధిస్తున్నాడు. దీంతో బాలిక తండ్రి యువకుడి తల్లిదండ్రులను కలిశాడు. తమ కూతుర్ని వేధిస్తున్నాడని చెప్పాడు. వాళ్లు ఇకపై ఇలా జరగదని హామీ ఇచ్చారు. అయితే, ఈ సోమవారం బాలిక ఫేర్‌వెల్ పార్టీకి వెళ్లింది. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈ నేపధ్యంలో అక్కడికి వచ్చిన యువకుడు ఆమె దగ్గరకు వచ్చాడు. ‘‘నువ్వు నన్ను మోసం చేశావ్’’ అని గట్టిగా అరిచి చేతిలో ఉన్న కత్తితో పొడవటం మొదలుపెట్టాడు.
పొట్ట, మణికట్టు, వీపుపై విచక్షణా రహితంగా పొడిచాడు. అక్కడ ఉన్న 20 మంది షాకై చూస్తూ ఉన్నారు. అతడు పొడిచిన తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను స్కూలు యజమాన్యం ఆసుపత్రికి తరలించింది. నిందితుడు ఇంటికి వెళ్లిన తర్వాత విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడ్ని కూడా ఆసుపత్రిలో చేర్చారు. యువకుడు, బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. యువకుడు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 45 రోజుల్లో ఆరుసార్లు ఒకే కుటుంబపై పాముకాటు! ఎందుకంటే..
దారుణం: కూతురికి కడుపు చేసిన తండ్రి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.