భార్యా భర్తల మధ్య సంబంధాలు నానాటికి దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న సమస్యలకే విడిపోతున్నారు. లేదంటే భర్తపై భార్య, భార్యపై భర్త అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా తమిళనాడులో కోర్టులోనే భార్యపై దాడి చేశారో భర్త.
ఆడ పిల్లలు పుడితే మహాలక్ష్మిగా భావించే అమ్మనాన్నలు..పరాయి మగవాడితో మాట్లాడితేనే ఊరుకోరు. కానీ పెళ్లీడు వచ్చాక ముక్కు మెహం తెలియని ఓ అయ్య చేతిలో పెట్టి.. జీవితాంతం అతడితోనే బతకాలంటూ వేస్తారు. కట్టుకున్న వాడి కోసం అందర్ని వదిలేసి వస్తున్న భార్యను భర్త నానా హింసలకు గురి చేస్తున్నారు. అభిప్రాయ బేధాలో, అనుమానాలో తెలియదు కానీ సంసార నావను రోడ్డున పడేసి.. ఆ తర్వాత కోర్టుకు చేరుకుంటున్నారు. ఇందులో కేవలం భర్తదే తప్పు అనలేము, కొన్ని సార్లు భార్యలు కూడా భర్తల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరిస్తుండటంతో పెళ్లిళ్లు ఇటీవల ఎక్కువగా న్యాయ స్థానాల్లోకి చేరుతున్నాయి. అయితే కొన్ని సార్లు ఇవి శ్రుతి మించి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. తమిళనాడులో కోర్టు ఆవరణలోనే భార్యపై దాడికి ఒడిగట్టాడు ఓ భర్త.
పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన భార్యా భర్తలు శివకుమార్, కవిత అలియస్ చిత్ర ఓ వివాదంపై కోయంబత్తూర్ కోర్టుకు వచ్చారు. భర్త తనను హింసిస్తున్నాడని భార్య కేసు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఇద్దరు కోర్టుకు వచ్చారు. అయితే భార్యపై రగిలిపోతున్న భర్త శివకుమార్ వాటర్ బాటిల్లో యాసిడ్ తీసుకు వచ్చాడు. అందరు చూస్తుండగానే.. కోర్టు ఆవరణలోనే భార్య ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా విస్తు పోయారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిపై యాసిడ్ పడటంతో వారు కూడా గాయపడ్డారు. తక్షణమే శివను పోలీసులు అదుపులోకి తీసుకుని, బాధితురాలిని చికిత్స నిమిత్తం కోయంబత్తూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.
Deputy Commissioner of Police visiting the Combined #Court Complex in #Coimbatore where a woman was attacked with acid by her husband on Thursday. 📽: @peri_periasamy / @THChennai #acid_attack pic.twitter.com/m2CnmWj19n
— Periasamy M (@peri_periasamy) March 23, 2023