ఇది వరకు ఒక ప్రాంతానికే పరిమితమైన వ్యభిచారం.. ఇప్పుడు కమర్షియల్ హంగులు అద్దుకున్నాయి. సెలూన్, మసాజ్ సెంటర్లలో ప్రాస్టిట్యూషన్ జరుగుతోంది. ఉద్యోగాల పేరిట అమ్మాయిలను రప్పించి, ఈ ఊబిలోకి లాగుతున్నారు.
ఇది వరకు ఒక ప్రాంతానికే పరిమితమైన వ్యభిచారం.. ఇప్పుడు కమర్షియల్ హంగులు అద్దుకుంది. సెలూన్, మసాజ్ సెంటర్లలో ప్రాస్టిట్యూషన్ జరుగుతోంది. ఉద్యోగాల పేరిట అమ్మాయిలను రప్పించి, ఈ ఊబిలోకి లాగుతున్నారు వ్యాపారస్థులు. హై క్లాస్ పీపుల్స్ ఎక్కువగా వచ్చే ఈ మసాజ్ సెంటర్లలో..థెరపీ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కొందరు. పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఎక్కడిక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి సెలూన్స్, మసాజ్ సెంటర్స్ర. బయటకేమో వ్యాపారం చేస్తూ, లోపల వ్యభిచారాన్ని సాగిస్తున్నారు. సెలూన్ ముసుగులో వ్యభిచార గృహాన్ని నడుపుతున్న ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరువళ్లూరు జిల్లా శివందినగర్ ప్రాంతంలో సెలూన్ వ్యాపారంలో వ్యభిచారాన్ని సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ సెలూన్‌పై ఆకస్మిక దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చెన్నైకు చెందిర రాజేష్, అన్న నూర్‌కు చెందిన గాయత్రిలను అరెస్టు చేశారు. వీరిద్దరే దీన్ని నడుపుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరి చెరలో ఉన్న ముగ్గురు యువతులను రిమాండ్‌కు తరలించారు. విఘ్నేష్ అనే వ్యక్తి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.