కొన్ని సంఘటనల గురించి వింటుంటే భయంతో పాటు బాధ, ఆవేశం కూడా పుట్టుకొస్తుంటాయి. చట్టాలు ఏమీ చేయలేవా అనిపిస్తుంటోంది. న్యాయ వ్యవస్థలో లోపాలను ఉపయోగించుకుని నేరస్థులు బయటకు వచ్చేస్తారన్న ఆలోచన వస్తుంది. అయినప్పటికీ కొన్ని దారుణాలు జుగుప్పకరంగా అనిపిస్తుంటాయి.
దేశంలో కొన్ని సంఘటనలు చూసినా, విన్నా.. లోకం తీరు ఇలా ఉందేంటీ, దేశం ఎటు పోతుందీ అనే భావన కలుగుతుంది. కొన్ని సంఘటనల గురించి వింటుంటే భయంతో పాటు బాధ, ఆవేశం కూడా పుట్టుకొస్తుంటాయి. ఏమీ చేయలేమన్న వేదన నుండి..చివరకు దేశంలోని నాయకుల మీదకు మళ్లుతుంది. అటు నుండి న్యాయ వ్యవస్థలో లోపాలను ఉపయోగించుకుని నేరస్థులు బయటకు వచ్చేస్తారన్న ఆలోచన వస్తుంది. చివరకు ఏమీ చేయలేమని తెలిసి.. మళ్లీ పనిలో బిజీగా గడుపుతుంటాం. ఎన్ని దారుణాలు చూస్తున్నాం. పోలీసులు, న్యాయ స్థానాలు చర్యలు తీసుకున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో ఘోరమైన దారుణం జరిగింది.
ఓ యువకుడిపై ఆరుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ బస్సు ప్రయాణం సాఫ్ట్ వేర్ ఉద్యోగికి నరకాన్ని చూపించింది. వివరాల్లోకి వెళితే.. పుత్తానందం నుండి మణిప్పారైకు బస్సులో 27ఏళ్ల సాఫ్ట్ వేర్ వెళుతున్నాడు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న పండిపేట్లైకు చెందిన అరివళగన్ అనే యువకుడితో వాదన జరిగింది. అరివళగన్ తన స్నేహితులకు ఫోన్ చేసి.. బస్సులో ఐటీ ఉద్యోగి తనపై దాడి చేశాడని, మణిప్పారైకి బస్సు వచ్చేలోపు అక్కడికి రావాలని చెప్పాడు. దీంతో అతడి స్నేహితులు బస్సు కోసం వేచి చూస్తూ ఉన్నారు. బస్సు రాగానే లోపల ఉన్న ఐటీ ఉద్యోగిని బలవంతంగా కిందకు దించి, నిర్వానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు.
లైంగిక దాడిని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ 75 వేల డబ్బులు వసూలు చేశారు. అయితే బాధిత టెకి ఫిర్యాదుతో ఆరుగురు యువకులను అరెస్టు చేశారు పోలీసులు. అరివళగన్‌తో పాటూ ముహమ్మద్, అరుణ్‌కుమార్, లియోబ్లాయిడ్, సెంథిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి గతంలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.