క్షణికమైన కామ వాంఛ కోసం కట్టుకున్న వాళ్లను మభ్య పెట్టి.. మరొకరితో పడకను పంచుకుని.. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు. వీరి వ్యవహారం బయటపడనంత వరకు దాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే వీరిని కాదని మరొకరితో చనువుగా ఉన్న ఓర్వలేకపోతున్నారు
నేటి వ్యవస్థలో వివాహ బంధం పూర్తిగా దెబ్బతింటుంది. భాగస్వామి కళ్లుగప్పి.. మరొకరితో అక్రమ, వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు కొందరు. క్షణికమైన కామ వాంఛ కోసం కట్టుకున్న వాళ్లను మభ్య పెట్టి.. మరొకరితో పడకను పంచుకుని.. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు. వీరి వ్యవహారం బయటపడనంత వరకు దాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే వీరిని కాదని మరొకరితో చనువుగా ఉన్న ఓర్వలేకపోతున్నారు. ఈ వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల కాలంలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. చేసిందో తప్పుడు పని, అయినా ఓర్వలేని తనంతో ఇద్దరిని హత్య చేసి, అతడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
వరుసకు వదినయ్య మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. ఆమె మరొకరితో చనువుగా ఉందని తెలిసి, భరించలేక వారిద్దరిని హత్య చేసి, అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సారవకోట కోదడ్డపనసలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. కోదడ్డపనస గ్రామానికి చెందిన వెలమల ఎర్రమ్మ (40) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన భాస్కరరావుతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. ఎర్రమ్మ వరుసకు మరిది అయిన ముద్దాడ రామారావు అనే వ్యక్తి వివాహేతర సంబంధం నెరుపుతోంది. అయితే ఆ మహిళ ముద్దాడ సంతోష్ అనే వ్యక్తితో చనువుగా ఉండటాన్ని పలుమార్లు చూశాడు రామారావు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో రామారావు రగిలిపోయాడు.
మంగళవారం సాయంత్రం కోదడ్డపనస గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు రామారావు. అనంతరం అదే కత్తితో పొలంలో పని చేస్తున్న ఎర్రమ్మ పైనా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అక్కడి నుండి పరారైన రామారావు.. అదే గ్రామ సమీపంలో విగత జీవిగా కనిపించాడు. అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామారావుగా గుర్తించిన గ్రామస్థులు .. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.