భారత్‌తో పోలిస్తే ఇతర దేశాల్లో ఉరిశిక్షకు దారి తీసే నేరాలు, ఆ శిక్ష అమలు చేసే విధానం వేర్వేరుగా ఉంటాయి. తాజాగా సింగపూర్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అక్కడి ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. ఇంతకు అతడు చేసిన నేరమేమిటే తెలుసా..
భారత్‌లో కరుగుగట్టిన తీవ్రవాదులకు, దేశ వ్యతిరేక శక్తులకు, హత్య, చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి (నేరారోపణ రుజువైన నేరస్థులకు) ఉరి శిక్ష విధిస్తుంటారు. అయితే భారత్ అంత త్వరగా ఉరిశిక్ష అమలు కాదు. ఇప్పటి వరకు కొన్ని కేసుల్లో మాత్రమే ఉరి శిక్ష అమలు జరిగాయి. కొన్నింటిలో నేరస్థులు క్షమాభిక్ష కోరితే యావజ్జీవ మరణ శిక్షగా కూడా మార్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే భారత్‌తో పోలిస్తే ఇతర దేశాల్లో ఉరిశిక్షకు దారి తీసే నేరాలు, ఆ శిక్షను విధానం వేర్వేరుగా ఉంటాయి. తాజాగా సింగపూర్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అక్కడి ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. ఇంతకు అతడు చేసిన నేరమేమిటే తెలుసా.. గంజాయి అక్రమ రవాణా.
భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య(46) అనే వ్యక్తిని చాంగి జైలులో సింగపూర్ అధికారులు ఉరి తీశారు. ఐక్యరాజ్య సమితి నుండి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికి అక్కడి ప్రభుత్వం ఈ ఉరిశిక్షను అమలు చేసింది. వివరాల్లోకి వెళితే..2013లో కిలోకి పైగా గంజాయి రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతడికి 2018 అక్టోబర్ 9న అక్కడి న్యాయ స్థానం ఉరిశిక్షను అమలు చేసింది. అయితే అతడికి క్షమాభిక్ష పెట్టాలని కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్, న్యాయ స్థానాలకు లేఖలు రాశారు.
సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రగ్ వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. గత ఏడాది డ్రగ్స్ ఆరోపణలపై దేశం 11 మందిని ఉరితీసింది, ఇందులో హెరాయిన్ అక్రమ రవాణా చేసినందుకు మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగం కూడా ఉన్నారు. ఇది మాదకద్రవ్యాల నేరాలను నిరోధించడానికి ఇలాంటి శిక్షలు అవసరమని సింగపూర్ చెబుతోంది. అయితే అతడికి క్షమాభిక్ష పెట్టాలని కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు.. ఐక్యరాజ్యసమితి, కోర్టులు, అధ్యక్షుడికి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే వారి అప్పీలును సింగపూర్ కోర్టులు చివరి నిమిషంలో మంగళవారం తిరస్కరించాయి. దీంతో బుధవారం ఉదయం అతడికి ఉరిశిక్ష అమలు చేసిందీ అక్కడి ప్రభుత్వం.
తంగరాజు ఏం నేరం చేయలేదని, మొదటి నుండి ఈ కేసుపై దృష్టి సారించాలని కోర్టును కోరుతున్నట్లు అతడి సోదరి లీలా సుప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిన తర్వాత ఛాంగి జైలులో గ్లాస్ కిటికీ మధ్యలో నుంచి తాము సుప్పయ్యను చూసేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ రోజు వస్తుందని తంగరాజు మానసికంగా సిద్ధమై ఉన్నారని, అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారని చెప్పారు. నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో దోషిగా తేలాడని, ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు.