ఊహించని విధంగా, ఊహాతీతంగా ఉపద్రవంలా ముంచుకొస్తుంటాయి ప్రమాదాలు. ఒక్కోసారి దీని తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. తక్కువగానూ ఉండవచ్చు. ఆ తర్వాత ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు. యాక్సిడెంటల్‌గా జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి.
తాడే పామై కాటు వేసిందన్నదీ సామెత. అంటే ప్రమాదం ఎటు నుండి ఎలా పొంచి వస్తుందో చెప్పలేం. ఊహించని విధంగా, ఊహాతీతంగా ఉపద్రవంలా ముంచుకొస్తుంటాయి ప్రమాదాలు. ఒక్కోసారి దీని తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. తక్కువగానూ ఉండవచ్చు. ఆ తర్వాత ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు. యాక్సిడెంటల్‌గా జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి. అప్రమత్తంగా ఉన్నామంటే చాలు.. మన చావును మనమే కోరుకుని తెచ్చుకున్నట్లు అవుతుంది. మనకు తెలియకుండా జరుగుతున్న ఈ ప్రమాదాల కారణంగా మనతో పాటు తల్లిదండ్రులు, భాగస్వామి, బిడ్డలను కన్నీటి సంద్రంలో మునుగుతున్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా వెనకా ముందు చూసుకోవాలని పెద్దలు అంటుంటారు. ఓ చిన్ననిర్లక్ష్యం ఆ పాలిట మృత్యుశాపమైంది.
ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాన్నినడిపే వ్యక్తులే కాదూ.. వెనుక కూర్చున్న వారు ప్రమాదాలకు గురౌతుంటారు. పిల్లలు తీసుకెళ్లేటప్పడు చక్రాల్లో కాలు పెట్టేయడం లేదంటే మహిళలు ధరించే దుస్తులు వాటిలో పడటం వంటి ఘటనలు చూశాం. వెళ్లే దారిలో ఎవరైనా కూడా చూస్తే అప్రమత్తం చేస్తారు. కానీ కొన్ని సార్లు విధి రాతకు ఎవ్వరైనా తలవంచాల్సి వస్తుంది. శైలజ విషయంలో అదే జరిగింది. ద్విచక్ర వాహనంలో చున్నీ ఇరుక్కుని శైలజ (19)మృతి చెందింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లాలోమనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన మంజుల, వెంకటేశ్‌గౌడ్ దంపతుల కూతురు శైలజను గత ఏడాది సిద్దిపేట జిల్లా ములుగు మండలం గంగాధర్‌పల్లికి చెందిన శ్యామల, సత్తయ్య దంపతుల కుమారుడు సురేశ్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు.
అయితే రెండు రోజుల క్రితం శైలజ మెదక్ జిల్లాలోని పుట్టింటికి వచ్చింది. తిరిగి తీసుకెళ్లేందు భర్త ద్విచక్రవాహనంపై వచ్చాడు. గురువారం ఉదయం కాళ్లకల్ నుంచి గంగాధర్‌పల్లికి ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బయలు దేరారు. ఆ సమయంలో ఆమె డ్రస్ ధరించింది. తునికి బొల్లారం సమీపంలోకి రాగానే వెనుక కూర్చున్న శైలజ.. ఒంటిపై ఉన్న చున్నీ చక్రంలో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా ఆమె కింద పడిపోయింది. ద్విచక్ర వాహనం వేగంగా వెళ్తుండటంతో సుమారు 200 మీటర్ల దూరం.. బండి ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో వివాహిత మృతి చెందింది. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబ సభ్యులు గొల్లు మన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.