పాత కక్షలను కడుపులో పెట్టుకుని..వారి హత్య చేసేంత వరకు నిద్రపోరు. కక్ష, కార్పణ్యాలతో తమ శత్రువును హతమార్చేందుకు ప్రణాళికలు రూపొందించడం, అవసరమైతే.. కిరాయి గూండాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. రాజమండ్రిలో వైసీపీ నేత హత్యకు గురయ్యాడు.
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు ఏర్పడటానికి పెద్ద కారణాలు అవసరం లేదు నేటి పరిస్థితుల్లో. మాటలు, మాటలు పెరిగి.. ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఈ ఘర్షణలు రాజుకుని పగలు, ప్రతీకారాలకు దిగజారుతున్నారు కొందరు. ఈ పాత కక్షలను కడుపులో పెట్టుకుని..వారి హత్య చేసేంత వరకు నిద్రపోరు. కక్ష, కార్పణ్యాలతో తమ శత్రువును హతమార్చేందుకు ప్రణాళికలు రూపొందించడం, అవసరమైతే.. కిరాయి గూండాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. పాత కక్షల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేత హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాజమండ్రిలోని సంజీవ్ నగర్‌లో చోటుచేసుకుంది.
వైసీపీ నేత బూరాడ భవానీ శంకర్(58) హత్యకు గురయ్యాడు. పాత కక్షలే ఈ మరణానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. సంజీవ్ నగర్‌లో భవానీ శంకర్ హత్యకు గురయ్యారు. భవానీశంకర్ 44వ వార్డు వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..సంజీవ్‌నగర్‌కు చెందిన బూరాడ భవానీశంకర్, అతడి భార్య కృష్ణమాధురి ఒక వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వచ్చారు. మేడపైన హాలులో భోజనం చేస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన అజయ్ అక్కడకు వచ్చాడు. అతడితో మాట్లాడాలంటూ పైకి వచ్చాడు అజయ్. అతని వెంట తెచ్చుకున్న కత్తిని చూసిన భార్య మాధురి గట్టిగా కేకలు వేసింది. వెంటనే కత్తిని తీసి అజయ్.. భవానీ శంకర్ కడుపులో మూడు సార్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు.
తీవ్రంగా రక్తమోడుతున్న భవానీ శంకర్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించిన పోలీసులు నిందితుడ్ని గుర్తించి అరెస్టు చేశారు. తన తండ్రి పీతా శేషును అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. అతడే హత్య చేశాడన్న అనుమానంతో ఇప్పుడు భవానీ శంకర్ ను హత్య చేసినట్లు నిందితుడు అజయ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ భరత్‌రామ్ మృతుడి భార్య కృష్ణమాధురిని ఫోన్‌లో పరామర్శించారు.