ఇటీవల కాలంలో అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు రావడం కష్టంగా మారిపోయింది. ఆడ పిల్లలకంటూ కొన్ని కలలు, ఆశలు ఉండటంతో.. వారి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వారిదే ఫైనల్ డెసిషన్ అయిపోయింది. ఆడ పిల్లలు ఓ పట్టాన వచ్చిన సంబంధాలకు తల ఊపడం లేదు. ఉద్యోగం, స్టేటస్ వెతకుతుండటంతో చిన్న ఉద్యోగులకు పిల్ల దొరకడం లేదు.
మనిషి జీవితంలో ఇంపార్టెంట్ ఇస్తున్న అంశాలు ఒకటి ఉద్యోగం, సంపాదన, రెండోది వివాహం. ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నకొందరు అందులో విజయాలు నమోదు చేస్తున్నారు. కానీ వివాహం విషయంలో మాత్రం తడబడుతున్నారు. ఇటీవల కాలంలో అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు రావడం కష్టంగా మారిపోయింది. ఆడ పిల్లలకంటూ కొన్ని కలలు, ఆశలు ఉండటంతో.. వారి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వారిదే ఫైనల్ డెసిషన్ అయిపోయింది. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడంతో..ఆడపిల్ల ఊ అన్నప్పుడు మాత్రమే సంబంధాలు చూస్తున్నారు. ఆడ పిల్లలు ఓ పట్టాన వచ్చిన సంబంధాలకు తల ఊపడం లేదు. ఉద్యోగం, స్టేటస్ వెతకుతుండటంతో చిన్న ఉద్యోగులకు పిల్ల దొరకడం లేదు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో జరిగింది.
ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరడం లేదని, జీవితంలో పెళ్లి కాదని భావించిన ఓ కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా మారాడు. ఈ ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రూప్ ఖాన్ పేట్ గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటేశం హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి సోమవారం తెల్లవారు జామున ఇంటి నుండి బయటకు వెళ్లాడు. అయితే కొద్ది సేపటికి ‘నీ కొడుకు మీ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడంటూ’తల్లికి గ్రామస్థులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చి ఉరేసుకొని మృతి చెందిన కానిస్టేబుల్ ఉప్పరి వెంకటేశం శవాన్ని పరిశీలించారు. అనంతరం తల్లి ఉప్పరి రాములమ్మను ప్రశ్నించగా.. నీ కొడుకు ఎందుకు ఉరేసుకొని ఉంటాడని అడుగగా ఈ మధ్య కాలంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదంటూ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడేమో అని తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.