కొన్ని ఘటనలు చూస్తుంటే దేశం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు. ఆ ఘటనల గురించి చదువుతుంటే బాధతో పాటు భయం, కోపం కూడా వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. వరుసకు మరదలయ్యే గర్భిణీపై ఒ కామాంధుడు అత్యాచాారానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన అతడి భార్య చూస్తుండగానే చోటుచేసుకుంది. అంతేకాదూ..
మానవ సంబంధాలు రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. కొన్ని ఘటనలు చూస్తుంటే దేశం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు. ఆ ఘటనల గురించి చదువుతుంటే బాధతో పాటు భయం, కోపం కూడా వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. ఓ నిండు చూలాలిపై బంధువు ఒకడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే అందుకు అతడి భార్య కూడా సహకరించడం శోచనీయం. అంతేకాకుండా ఆ దృశ్యాన్ని వీడియోలు తీసి బెదిరించడం కూడా చేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. చివరకు మానసిక సంఘర్షణకు లోనైన గర్భిణీ ఆత్మహత్యకు చేసుకునేందుకు ప్రయత్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నబరంగ్‌పూర్ జిల్లాలో ఖతీగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యా భర్తలైన లిలియా రుంజికర్, పద్మ రుంజికర్లను నిందితులుగా గుర్తించారు. వీరిలో పద్మ ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నారు. వరుసకు మరదలైన గర్భిణీపై లిలియా మోజు పడ్డాడు. గత నెల 28న పద్మ ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను నబరంగ్‌పూర్‌లోని పఠానా సాహిలోని ఓ ఇంటికి పిలిపించింది. ఇవేమీ తెలియని బాధిత మహిళ.. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా అక్కడికి వెళ్లింది. అక్కడే ఉన్న పద్మ భర్త గర్భిణీపై అత్యాచారం చేయగా.. ఈ మొత్తం ఘటనను భార్య వీడియో తీసింది. అనంతరం ఈ విషయాన్ని చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో మిన్నకుండిపోయింది.
బెదిరింపులకు భయపడి, బాధిత మహిళ ఈ ఘోరం గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అయితే మానసికంగా, లైంగిక వేధింపులకు గురికావడంతో సదరు బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను రక్షించారు. పలుమార్లు అడగడంతో చివరకు జరిగినదంతా కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దీంతో బాధితురాలు ఖతీగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రికి తరలించారు. ఖతీగూడ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టారు. నిందితుడు లిలియా, అతని భార్య పద్మలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వాటిని తొలగించారు.