దేశంలో యువత పెడదోవ పడుతుంది. చిన్న వయస్సులోనే గన్ కల్చర్ కు అలవాటు పడుతోంది. ఇక్కడ ఆయుధాల వినియోగానికి అనుమతి లేనప్పటికీ.. యువత చేతిలో గన్స్ కనిపిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
దేశంలో యువత గన్ కల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో ఇంకా ఇటువంటి ఆయుధాల వినియోగానికి అనుమతి లభించనప్పటికీ.. అవి యువతకు విరివిగా లభిస్తున్నాయి. చిన్న వయస్సులోనే హత్యలకు ఒడిగడుతున్నారు. గ్యాంగ్ స్టర్స్‌గా మారిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై మరో యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్క సారిగా హస్తీనా ఉలిక్కిపడింది. రక్తపు మడుగుల్లో పడి ఉన్న బాలికను కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలు, నిందితుడు ఒకరికి ఒకరు తెలుసునని వెల్లడించారు.
ఈ ఘటన ఢిల్లీలోని నంద్ నగ్రి జిల్లాలో సుభాష్ పార్క్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీతి, ఖాసిమ్ ఇద్దరు మంచి స్నేహితులని, ఓ విషయంపై వీరిద్దరికీ మధ్య వాగ్వాదం జరిగిందని, అనంతరం ఖాసిం ఆమె భుజంపై కాల్పులు జరిపాడని చెప్పారు. ప్రీతికి 16 ఏళ్లు అని, ఖాసింకు 19 నుండి 20 ఏళ్లు ఉంటాయని చెప్పారు. అయితే ఓ అమ్మాయి విషయంలో ప్రీతిపై ఖాసిమ్ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా బాధితురాలు ప్రీతి తెలిపింది. ఇదేమీ మొదటి సారి కాదని, గతంలో కూడా తన వద్దకు వచ్చి ఇలానే బెదిరించాడంటూ చెప్పింది.
తనకు చాలా నొప్పిగా ఉందని ఆవేదన చెందింది. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేశాడు. అయితే ఈ ఘటన తర్వాత ఖాసిమ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెప్పారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రీతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎవ్వరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. ఎంతో భవిష్యత్తు కలిగిన యువత ఇలా పెడదోవ పట్టడానికి కారణాలను మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.