ఆస్తి, అంతస్థులు, ప్రేమ కారణంగా రక్త సంబంధీకుల మధ్య ఘర్షణలు.. ఆ తర్వాత పెను విషాదాన్ని నింపుతున్నాయి. తోడబుట్టువులను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా కూతుర్ని ప్రేమించాడని ఓ మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నేడు కుటుంబ బాంధవ్యాలకు విలువ లేకుండా పోయింది. ఆస్తి, అంతస్థు, ప్రేమ, ఆర్థిక కారణాలు కుటుంబాల మధ్య చిచ్చురేపుతున్నాయి. ఆస్థి కోసం తల్లిదండ్రులు, అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్లను పొట్టన పెట్టుకుంటున్నారు కొందరు. ఆస్తి కోసం సొంత తమ్ముడిని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా చంపేశాడో అన్నయ్య. వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన మర్చిపోక ముందే.. కొడుకు తర్వాత కొడుకు అంతటి వాడైన మేనల్లుడిని మేనమామే దారుణంగా హత్య చేసిన ఘటన విస్తు గొల్పుతుంది. రక్త సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దండేపల్లి మండల గూడెం గ్రామంలో ఓ కుటుంబం నివసిస్తోంది. అయితే అతడి కుమార్తె, మేనల్లుడు దుడ్డంగుల అనిల్ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన మేనమామ పలుమార్లు అనిల్‌ను హెచ్చరించాడు. అయినప్పటికీ అతడి పంథా మార్చుకోకపోవడంతో మాట్లాదామని మేనల్లుడ్ని పిలిచాడు మేనమామ. లక్సెట్టిపేట మున్సిపాలిటీ శివారులోని మోదెల చెట్ల సమీపానికి చేరుకోగానే మేనల్లుడిని కత్తితో బెదిరించాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న గడ్డిమందు కలిపిన బీర్ మేనల్లుడితో బలవంతంగా తాగించాడు. స్పృహ తప్పగానే అనిల్ మేనమామ అక్కడి నుండి పరారయ్యాడు.
అటుగా వెళ్తున్న వారు అనిల్‌ను గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు అనిల్ చనిపోకముందు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనిల్ చనిపోయే ముందు వివరించిన వీడియో ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. అన్నప్రాసన్న సమయంలో గోరు ముద్దలు తినిపించే మేనమామ.. కూతురి విషయంలో కఠినాత్మకంగా వ్యవహరించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.