ఆరు రోజుల క్రితం మలక్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల గూడలో లభించిన మొండెం లేని తల ఘటన ఎంతటి సంచలనం కలిగిచిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసును పోలీసులు చేధించారు. హతురాలిని గుర్తించారు.
ఆరు రోజుల క్రితం హైదరాబాద్‌లోమలక్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల గూడలో లభించిన మొండెం లేని తల ఘటన ఎంతటి సంచలనం కలిగిచిందో అందరికీ తెలుసు. నల్లటి కవర్‌లో మహిళ తల ఆ ప్రాంతంలో పడేసి ఉంది. ఈ కవర్‌ను చూసిన స్థానికులు భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కవర్ తెరిచి చూడగా ఓ మహిళ తలగా గుర్తించారు. ఆమెను ఎక్కడో హత్య చేసి.. తల, మొండం వేరు చేసి.. తలను మాత్రం కవర్‌లో కట్టేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావించారు. మహిళ తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టింది. క్లూస్ టీంను రంగంలోకి దింపింది. సుమారు 8 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టాయి. ఆ చుట్టు ప్రక్కల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అయితే ఆమె ఎవ్వరన్నదీ తెలియరాలేదు
ఇప్పుడు ఈ కేసును పోలీసులు చేధించారు. హతురాలిని గుర్తించారు. కేర్ ఆసుపత్రిలో పనిచేసే నర్సు ఎర్రం అనురాధగా నిర్ధారణైంది. ఆ తల ఆమెదేనని మృతురాలి సోదరి, బావ ధ్రువీకరించారు. ఆమెను హత్య చేసింది చంద్రమోహన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రమోహన్ చైతన్యపురిలో ఉంటూ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తాడు. అతడి ఇంట్లోనే అద్దెకు ఉంటున్న అనురాధ కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె ఒంటరి మహిళ. గతంలో అనురాధ వద్ద 7 లక్షల రూపాయలను చంద్రమోహన్ వడ్డీకి తీసుకున్నాడని, డబ్బులు అడగడంతో ఆమెను చంద్రమోహన్ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. చైతన్యపురిలోని చంద్రమోహన్ ఇంట్లో అనురాధ డెడ్ బాడీ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనూరాధను హత్య చేసిన దుండగులు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో దాచినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అన్ని ఆధారాలను క్లూస్ టీం సభ్యులు సేకరిస్తున్నారు.