ఇటీవల దేశంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు. దానికి సంబందించిన వార్తలను టీవీల్లో చూసినప్పడు ఒళ్లు గగొర్పుడుస్తుంది. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు అటువంటిదే. మనుషుల రూపంలో ఉన్న కొంత మంది మృగాలుగా మారి.. అఘాయిత్యాలకు తెరలేపుతున్నారు. ఆ సమయంలో కించిత్ మానవత్వం కూడా వారిలో కనిపించడం లేదు.
ఇటీవల దేశంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు. దానికి సంబందించిన వార్తలను టీవీల్లో చూసినప్పడు ఒళ్లు గగొర్పుడుస్తుంది. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు అటువంటిదే. ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా ఆమెను అత్యంత కిరాతకంగా నరికి.. ఫ్రిజ్‌లో శరీర భాగాలు దాచిన పెట్టిన సంగతి విదితమే. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇటువంటి తరహా ఘటనలే అనేకం చోటుచేసుకున్నాయి. ఇవన్నీ మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భయాందోళనకు గురి చేస్తున్నాయి. మనుషుల రూపంలో ఉన్న కొంత మంది మృగాలుగా మారి.. అఘాయిత్యాలకు తెరలేపుతున్నారు. ఆ సమయంలో కించిత్ మానవత్వం కూడా వారిలో కనిపించడం లేదు. సాటి మనిషిని చంపుతున్నామన్న ఆలోచన చేయడం లేదు. అటువంటి ఘటనే ఇది.
మేకలను మేపేందుకు పొలంలోకి వెళ్లిన 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ వ్యక్తి ఉన్మాదిలా హతమార్చిన ఘటన మహారాష్ట్రలోని పాలి అడవులకు సమీపంలో చోటుచేసుకుంది. పాలికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని శారద్నా గ్రామంలో జరిగింది. వృద్ధురాలిపై దాడి చేసిన సైకో.. ముఖంపై రాళ్లతో కొట్టి చంపాడు. అంతటితో ఊరుకోకుండా.. చితికిపోయి.. రక్తంతో తడిసిన ఆమె మాంసాన్ని తిన్నాడు. అక్కడి నుండి పరారయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో గ్రామస్థులు చూసి కిలోమీటరుకు పైగా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ముంబయికి చెందిన సురేంద్ర (24)గా గుర్తించారు. అతడు డ్రగ్స్ కు బానిసైనట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మృతురాలు శాంతి దేవి నానా కథత్ కనక్ కళాశాల సమీపంలో మేకలను మేపేందుకు వెళ్లింది. ఆ తర్వాత పొలం నుంచి కూరగాయలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నిందితుడు సురేంద్ర వృద్ధురాలిపై దాడి చేసి చంపాడు. ఇంకా ప్రాణం ఉందని నిర్ధారించుకునేందుకు ఏమో.. అనంతరం ఆమె ముఖాన్ని రాయితో చితకబాదాడు. అనంతరం మృతదేహంలోని మాంసం ముద్దలను తిన్నాడు. ఇది గమనించిన బాటసారులు గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు తన వద్దకు రావడంతో నిందితుడు తప్పించుకోవడం ప్రారంభించాడు, అయితే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతుడిని సెంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడి ఆధార్ కార్డు ద్వారా అతడి గుర్తింపు బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.