చదువుకోవాల్సిన సమయంలో చెడు సావాసాలకు, చెడు అలవాట్లకు లోనైన విద్యార్ధులు దారుణాలకు ఒడిగడుతున్నాడు. డబ్బుల కోసం తల్లిదండ్రులను హింసిస్తున్నారు. లేవంటే వారిపై కూడా దాడికి దిగుతున్నారు. ఆ తర్వాత విచక్షణ కోల్పోయి.. చిన్న విషయాలను పెద్దగా స్పందించడం, ప్రాంతమేమీ లేకుండా గొడవలకు దిగడం చేస్తున్నారు
డబ్బు, అమ్మాయిలు, మద్యం ఇవే నేటి కుర్రకారును తప్పుదోవ పట్టిస్తున్నాయి. డబ్బు కోసం ఎంతటి పనైనా చేసేందుకు వెనుకాడటం లేదు. అలాగే ప్రేమించి అమ్మాయిని దక్కించుకోవడం కోసం చస్తున్నారు లేదా చంపేస్తున్నారు. ఇవి కాకపోతే మద్యం లేదా మత్తు పదార్థాలకు బానిసలై భవితవ్యంపై ఆశల్ని గల్లంతు చేసుకుంటున్నారు. చెడు అలవాట్లకు లోనై.. డబ్బుల కోసం తల్లిదండ్రులను హింసిస్తున్నారు. లేవంటే వారిపై కూడా దాడికి దిగుతున్నారు. ఆ తర్వాత విచక్షణ కోల్పోయి.. చిన్న విషయాలను పెద్దగా స్పందించడం, ప్రాంతమేమీ లేకుండా గొడవలకు దిగడం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి విషయంలో అకారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌పై దాడి చేశారు కొందరు.
ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీ తాండ్రపాడు గ్రామంలో నివాసం ఉంటున్న నాగరాజు ఇంటి పక్కన రాకేష్‌తోపాటు మరో ఐదుగురు విద్యార్థులు అద్దెకు ఉంటున్నారు. ప్రతి రోజూ గదిలో మద్యం సేవిస్తూ అల్లరి చేస్తుండడంతో నాగరాజు విద్యార్థులను మందలించాడు. అయితే విద్యార్థులు ‘నువ్వు ఎవరూ చెప్పడానికి అంటూ ’అతనిపై దాడి చేశారు. ఈ దాడి గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేందుకు రోడ్డుపై ఉన్న జిరాక్స్ సెంటర్ వద్ద నిల్చొగా.. మరోసారి నాగరాజుపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల వాచ్‌మెన్‌ను గాయపరిచారు.
వాచ్‌మెన్‌తో ఓ యువతి ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ రాకేష్‌తో పాటు మరికొంతమంది పోకిరీలు అల్లరి చేస్తుండడంతో అక్కడే ఉన్న జగదీశ్వర్‌రెడ్డి ఇది పద్ధతి కాదంటూ అడ్డు చెప్పారు.జగదీశ్వర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ నిర్వాహకులు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడంతో కొంతకాలంగా ఇంటి వద్దనే విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనంతా సీసీ పుటేజీలో రికార్డు కావడంతో.. బాధితులు వేర్వేరుగా కర్నూలు అర్బన్ తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రాకేష్ తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జగదీశ్వర్‌రెడ్డి.. సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డికి సమీప బంధువు కావడంతో దాడి సంఘటనను ఎస్పీ కృష్ణకాంత్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.