కళ్లు మూసుకుని నన్ను ఎవ్వరూ చూడటం లేదని పిల్లి పాలు తాగిన సామెత లెక్క చందంగా కొంత మంది ప్రవర్తిస్తుంటారు. కుట్ర చేసి.. ప్రణాళిక ప్రకారం.. మోసాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. పోలీసులు కళ్లుగప్పి తిరుగుతుంటారు. న్నాళ్లకైనా పాపం పండితే.. పదేళ్లు కాదూ 20 ఏళ్లు కాదూ 50 ఏళ్లు కూడా దొరకాల్సిందే
తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష నుండి తప్పించుకోలేమన్నదీ చట్టం చెబుతుంది. మూడో కంటికి తెలియకుండా తప్పులు చేసి, ఏమీ ఎరగన్నట్లు చట్టానికి, న్యాయానికి దొరక్కుండా తిరుగుతుంటారు కొందరు. కళ్లు మూసుకుని నన్ను ఎవ్వరూ చూడటం లేదని పిల్లి పాలు తాగిన సామెత లెక్క చందంగా కొంత మంది ప్రవర్తిస్తుంటారు. కుట్ర చేసి.. ప్రణాళిక ప్రకారం.. మోసాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. పోలీసులు కళ్లుగప్పి తిరుగుతుంటారు. సాక్ష్యాలు నామ రూపాలు లేకుండా చేసి.. తర్వాత ఏమీ ఎరగనట్లు నటిస్తుంటారు. కానీ ఎన్నాళ్లకైనా పాపం పండితే.. పదేళ్లు కాదూ 20 ఏళ్లు కాదూ 50 ఏళ్లు కూడా దొరకాల్సిందే. ఇదే నిజమైందీ ఆమె విషయంలో.. 35 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యంది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని పతనంతిట్ట జిల్లా తుల్లపల్లికి చెందిన మరియమ్మ అలియాస్ లీలమ్మ (69) జోసెఫ్ మరికొందరితో కలిసి హైదరాబాద్ కేంద్రంగా 40 ఏళ్ల క్రితం ఓ ఫైనాన్స్ వ్యాపారం మొదలు పెట్టారు. అధిక వడ్డీకి చెప్పి.. పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి.. ఎత్తేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా 1987లో ఆర్థిక మోసానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. ఇది జరిగి 36 ఏళ్లు గడిచిపోయింది. ఇటీవల సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్ భగవత్ సీఐడీ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అప్పుడు మరియమ్మ కేసు బయటకు వచ్చింది. ఈ కేసులో మరియమ్మ 11వ నిందితురాలిగా ఉంది. ఆ తర్వాత ఈ కేసు సీఐడికి బదిలీ అయ్యంది. ఇక అప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉండడంతో మరియమ్మపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లోనే ఉంది.
36 ఏళ్లు గడిచినా మహిళా నిందితురాలు కనిపించకపోవడంతో మహేశ్ భగవత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే సీఐడీ ఎస్పీ బి. రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసారు. ఎలాగైనా నిందితురాలని పట్టుకోవాలని విచారణ వేగవంతం చేశారు. నిందితురాలిదీ కేరళ అని తేలింది. ఆమె అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అనంతరం హైదరాబాద్ తరలించి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితురాలిని జైలుకు తరలించారు. 36 ఏళ్ల తర్వాత నిందితురాలు జైలు పాలైంది. కేసు నమోదైనప్పుడు ఆమె యుక్త వయస్సులో ఉండగా.. వృద్యాప్యంలో పోలీసులకు చిక్కింది.