ఒత్తిడి కూడిన చదువులు చదవకలేక కొంత మంది ఆత్మహత్యలకు ఒడిగడుతుంటే.. ఇంకొన్ని సార్లు విద్యార్థులను డీగ్రేడ్ చేస్తూ అధ్యాపకులు.. తోటి వారి ముందు హేళన చేస్తుంటే తట్టుకోలేక కొంత మంది బలవన్మరణాలకు దిగుతున్నారు. ల్యాబ్ సెషన్‌లో విద్యార్థిని ఫోను తీసిందని కోప్పడిన అధ్యాపకుడు..
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి.. వారి ఎదుగుదలకు అండగా నిలవాల్సిన విద్యా సంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు స్టూడెంట్స్ పాలిట యమధూతలుగా మారుతున్నారు. ఒత్తిడి కూడిన చదువులు చదవకలేక కొంత మంది ఆత్మహత్యలకు ఒడిగడుతుంటే.. ఇంకొన్ని సార్లు విద్యార్థులను డీగ్రేడ్ చేస్తూ అధ్యాపకులు.. తోటి వారి ముందు హేళన చేస్తుంటే తట్టుకోలేక కొంత మంది బలవన్మరణాలకు దిగుతున్నారు. తాము తప్పులు చేస్తే పెద్ద మనస్సు చేసుకుని.. చాలా సున్నితంగా చెప్పాల్పిన లెక్చరర్స్ చాలా కాఠిన్యంగా వ్యవహరిస్తుండటంతో మనస్థాపానికి గురౌతున్న విద్యార్థులు ఉరి కొయ్యేలకు వేలాడుతున్నారు. అయితే కాలేజీలో కొన్ని పాలిటిక్స్ వల్ల కూడా విద్యార్థులు బలౌతున్నారు.
ల్యాబ్ సెషన్‌లో విద్యార్థిని ఫోను తీసిందని కోప్పడిన అధ్యాపకుడు.. ఆమె ఫోన్ లాక్కోవడంతో పాటు తిట్టడంతో ఆ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన కేరళలోని కంజిరపల్లిలోని చోటుచేసుకుంది. అమల్ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఫుడ్ టెక్నాలజీ విద్యార్థి శ్రద్ధా సతీష్ (20) ఆత్మహత్య చేసుకోవడం అక్కడి వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 2న కాలేజీ ల్యాబ్ సెషన్‌లో ఉండగా.. ఫోన్‌కు నోటిఫికేషన్ రావడంతో చూసేందుకు ఫోన్ బయటకు తీయగా.. అక్కడే ఉన్న అధ్యాపకులు.. ఆమె ఫోన్ లాక్కుని, హెచ్ఓడీ కార్యాలయానికి తీసుకెళ్లాడు. శ్రద్ధాను ఇష్టమొచ్చినట్లు తిట్టినట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ తర్వాత కాలేజీ హాస్టల్లో విగత జీవిగా కనిపించింది. కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ తోటి విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసుల వారిని చెదరగొట్టే క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆమె కావాలనే టార్గెట్ చేసి.. చనిపోయేలా చేశారని ఆరోపిస్తున్నారు. కాలేజీకి సంబంధించి గతంలో ఓ ఆన్ లైన్ సర్వేలో పాల్గొన్న ఆమె.. తన అభిప్రాయాన్ని పంచుకోగా.. అదే కాలేజీ యాజమాన్యం మనస్సులో పెట్టుకుని వేధించారు తోటి విద్యార్థులు వాదిస్తున్నారు. రెండు రోజులు తమతో హాయిగా గడిపి వెళ్లిన కుమార్తె అదే రోజు చనిపోయిందని వార్త కాలేజీ యాజమాన్యం నుండి అందిందని అనుమానం వ్యక్తం చేశారు ఆమె తండ్రి.