చిన్న జ్వరమొచ్చినా, పెద్ద ప్రమాదం ఎదురైనా ఆశ్రయించేది వైద్యులనే. నేటి యుగంలో వైద్యం కమర్షియల్ రంగులు పులుముకున్నా.. తన వైద్య వృత్తికి న్యాయం చేస్తూనే ఉంటారు వైద్యులు. దేవుడి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న వైద్యులకు ఎంత మొక్కినా తక్కువే.
అమ్మ మనకి జన్మనిస్తే.. మనకు పునర్జన్మను ఇచ్చేది మాత్రం వైద్యులే. వైద్యుడు లేకుంటే మానవ మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పాలి. ఒకప్రాణం నిలబెట్టడానికి కొన్ని సమయాల్లో డాక్టర్ల చేసే ప్రయత్నం దేవుళ్ళని మరిపిస్తుంది. చిన్న జ్వరమొచ్చినా, పెద్ద ప్రమాదం ఎదురైనా ఆశ్రయించేది వైద్యులనే. నేటి యుగంలో వైద్యం కమర్షియల్ రంగులు పులుముకున్నా.. తన వైద్య వృత్తికి న్యాయం చేస్తూనే ఉంటారు వైద్యులు. దేవుడి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న వైద్యులకు ఎంత మొక్కినా తక్కువే. తనకు ప్రాణం పోస్తున్న వైద్యురాలి ప్రాణం తీశాడో మూర్ఖుడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కాలికి గాయమైందని పోలీసులకు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్లిన ఉపాధ్యాయుడు.. అతడికి వైద్యమందించిన డాక్టర్‌నే కిరాతకంగా పొడిచి చంపిన ఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ ఎయిడెడ్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు సందీప్. గత కొద్ది కాలం నుంచి డ్రగ్స్‌కు అలవాటు అయ్యాడు. డ్రగ్స్ సేవించి పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఇబ్బంది పెడుతుండటంతో అతడిని సస్పెండ్ చేశారు. స్థానికులతో గొడవలు పడటం మొదలు పెట్టాడు. మంగళవారం కుటుంబ సభ్యులతోనూ గొడవ పెట్టుకోవడమే కాకుండా స్వయంగా పోలీసులకు ఫోన్ చేశాడు. ఈ గొడవల్లో తన కాలికి దెబ్బతగిలిందని, నడవలేకపోతున్నానని, ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ పలుమార్లు ఫోన్ చేసి విసిగించాడు.
పోలీసులు వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు చేసిన ఫిర్యాదుదారుడు కావడంతో ఎటువంటి సంకెళ్లు వేయలేదు పోలీసులు. ఆ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ డాక్టర్ వందన.. అతడికి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం కాలికి చికిత్స అందిస్తుండగా.. ఒక్కసారిగా అక్కడే ఉన్నకత్తెరతో నిన్నుచంపేస్తా అంటూ డాక్టర్ వందన ఛాతీలో ఐదు సార్లు పొడిచాడు. అక్కడే ఉన్న పోలీసుపై కూడా దాడి చేశాడు. ఆసుపత్రిలో ఉన్న వస్తువులన్నీ పగుల గొట్టేశాడు. అప్పుడు అతడికి సంకెళ్లు వేసి, అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ వందనను వెంటనే డాక్టర్‌ని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు చూసి ఆమె మృతి చెందిందని చెప్పారు. ఈ దాడిని ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ ఖండించింది. ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని కేరళ వైద్యులు అన్నారు.