ప్రేమించామని చెప్పగానే.. ఆస్తి, హోదా, కులం, మతం అంటూ వంకలు వెతికి పిల్లల ప్రేమను ఒప్పుకోకవడం లేదు తల్లిదండ్రులు. తాము తెచ్చిన సంబంధాన్ని చేసుకోకపోతే చచ్చిపోతామంటూ బెదిరిస్తున్నారు. కొన్ని సార్లు తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పడం కూడా మానేస్తున్నారు. దీంతో మనస్సులో ఒకరిని పెట్టుకుని మరొకరితో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. చివరకు..
పిల్లల మనస్సులను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. తాము ప్రేమించామని చెప్పగానే.. ఆస్తి, హోదా, కులం, మతం అంటూ వంకలు వెతికి వారి ప్రేమను ఒప్పుకోకవడం లేదు. తాము తెచ్చిన సంబంధాన్ని చేసుకోకపోతే చచ్చిపోతామంటూ బెదిరిస్తున్నారు. కొన్ని సార్లు తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పడం కూడా మానేస్తున్నారు. దీంతో మనస్సులో ఒకరిని పెట్టుకుని మరొకరితో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. చేసేదేమీ లేక తలొంచుకు తాళి కట్టించుకుంటున్న అమ్మాయిలు.. ఆ తర్వాత జీవిత భాగస్వామితో సఖ్యంగా ఉండలేకపోతున్నారు. దీని మూలంగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరకు తీవ్ర స్థాయికి దారి తీస్తున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి ఎంత అఘాయిత్యానికి ఒడిగట్టిందంటే..?
కర్ణాటకకు చెందిన ఆనంద్, మమతలది పెద్దల కుదిర్చిన వివాహం. వీరికి 4 సంవత్సరాల క్రితం పెళ్లి అయినప్పటికీ..ఇద్దరూ మధ్య రోజు గొడవలు జరుగుతుండేవి. దీంతో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటేనైనా వీరి మధ్య సఖ్యత కుదురుతుందని భావించి వీరిని వేరో ఇంట్లో ఉంచారు. అయితే అక్కడకు వెళ్లిన కొద్ది రోజులకే ఆనంద్ బాత్రూములో రక్తపు మడుగుల్లో కనిపించాడు. చేయి కోసుకుని ప్రాణం తీసుకున్నట్లుగా కనిపించాడు. దీంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే 2 నెలల తర్వాత వచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టు పోలీసులను దిమ్మదిరిగేలా చేసింది. ఎందుకంటే అది ఆత్మహత్య కాదు.. హత్య అని తేలింది. ఈ హత్యను చేసింది మమతేనని నిర్ధారించారు. అతడిదీ ఆత్మహత్య కాదూ.. హత్యేనని..కుమారుడు,కోడల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని ఆనంద్ తల్లిదండ్రులు పేర్కొనడంతో పోలీసులు రంగంలోకి దిగి.. విచారణ చేపట్టారు.
ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. అసలేం జరిగిందంటే..? కాలేజీలో చదువుకునే సమయంలో మమత.. హరీష్ అన్నో అనే వ్యక్తిని ప్రేమించింది. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ ఆమె తల్లిదండ్రులు ఆనంద్‌తో పెళ్లి నిశ్చయించడంతో తన ప్రేమను చంపుకోలేక.. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఆనంద్ పెళ్లైన తర్వాత.. అతడిని చంపేసి.. ఆ ఆస్తిని కొట్టేసి.. ప్రియుడ్ని పెళ్లాడాలని నిర్ణయించుకుంది. అయితే వీరు తల్లిదండ్రులతో కలిసి ఉండటంతో.. మమత, హరీష్ ప్లాన్.. ఫలించలేదు. దీంతో రోజు అతడితో గొడవపడేది. చివరకు వేరే కాపురం పెడితే చంపేయొచ్చునని భావించింది. అనుకున్నట్లే వేరో ఇంటికి వెళ్లిన కొద్దీ రోజులకు వారి ప్లాన్ అమలు చేశారు. ఆనంద్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో చివరకు పోలీసులకు దొరికిపోయింది.