నేటి సమాజంలో మానవతా విలువలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తల్లిదండ్రుల తర్వాత జీవితంలో అడుగుపెట్టే భాగస్వామితోనే ఎక్కువ కాలం జీవిస్తుంటారు. కానీ ఆ బంధం రాను రానూ బలహీనంగా తయారు అవుతుంది.
నేటి సమాజంలో మానవతా విలువలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. తల్లిదండ్రుల తర్వాత జీవితంలో అడుగుపెట్టే భాగస్వామితోనే ఎక్కువ కాలం జీవిస్తుంటారు. కానీ ఆ బంధం రాను రానూ బలహీనంగా తయారు అవుతుంది. భార్యా, భర్తలకు పొసగడం లేదు. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు చిన్న చిన్న విషయాల దగ్గరే మాట మాట పెరిగి.. మనస్పర్థలకు దారి తీస్తున్నాయి. కొన్ని సార్లు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు లేదంటే.. మౌనంతోనే చంపేస్తుంటారు. అయితే ఇదే పరాయి వ్యక్తుల సాన్నిహిత్యానికి కారణమౌతుంది. వివాహేతర లేదా అక్రమ సంబంధాలకు దారి తీస్తుంది. దీంతో అనేక దారుణాలు జరుగుతున్నాయి. ప్రియుడి కోసం భర్తను ఆ ఇల్లాలు ఏం చేసిందంటే..?
తమ రాసలీలలకు భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని అంతమొందించి.. ఆ తర్వాత సినిమా స్క్రీన్ ప్లే అల్లింది. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించే సరికి గుట్టు రట్లయ్యింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో రమేష్ కాంబళె, సంధ్యా దంపతులు నివసిస్తున్నారు. అయితే సంధ్యా .. బాళు బీరెంజె అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో హాయిగా గడపసాగింది. అయితే తమ వ్యవహారానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. ముగ్గురితో కలిసి ఈ ఏడాది మార్చిలో హతమార్చింది. నెల తర్వాత తన భర్త కొన్ని రోజుల నుండి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.
అయితే అతడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, తనను వదిలేసి.. ఆమెతో వెళ్లిపోయినట్లు కట్టు కథ అల్లింది. అయితే భర్త రమేష్ ఫోన్ ఇంట్లోనే ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. ప్రియుడి కోసమే భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు హత్యకు సహకరించిన ముగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.