ఇటీవల మహిళలు..తీరు వివాదాస్పదంగా మారింది. పరాయి పురుషుడిపై వ్యామోహంతో భర్తను అడ్డు తొలిగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమీ ఎరగన్నట్లు వ్యవహరిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగితే కానీ.. వీరి యవ్వారాలు బయట పడటం లేదు.ఓ మహిళా కూడా ఇలాంటి దారుణానికే ఒడి గట్టింది.
ఈ రోజుల్లో పెళ్లై పిల్లలు ఉన్నా.. కట్టుకున్న వారిని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. భార్యను కాదని భర్త, భర్తను కాదని భార్య.. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మరో కుంపటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక సమయం దొరికితే చాలు ఎంజాయ్ చేస్తూ చివరకు కట్టుకున్న వాళ్లని అతి దారుణంగా మోసం చేస్తున్నారు. ఇటీవల మహిళలు..తీరు వివాదాస్పదంగా మారింది. పరాయి పురుషుడిపై వ్యామోహంతో భర్తను అడ్డు తొలిగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత నంగనాచీలా ఏమీ ఎరగన్నట్లు కన్నీటి బొట్లను కరిగిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగితే కానీ.. వీరి యవ్వారాలు బయట పడటం లేదు. ఇటువంటివి దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. అలాగే ఓ మహిళా కూడా ఇలాంటి దారుణానికే ఒడి గట్టింది.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించి.. ఏం ఎరగనట్లు ఏడ్చిందో వగలాడి. ఈ ఘటన కర్ణాటకలో జరగ్గా.. మృతుడు ఆంధ్రప్రదేశ్ వాసి. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని చిత్తూరు జిల్లాలోని వేమూరుకు చెందిన తిమ్మప్ప, విజయమ్మ (30) దంపతులు. కూలీపనుల కోసం బెంగూళూరులోని మహాదేవునిపురానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. కూలీపనుల దగ్గర తిమ్మప్పకు తమిళనాడుకు చెందిన పెరుమాళ్ అనే వ్యక్తి పరిచమయ్యాడు. ఈ క్రమంలో వారి ఇంటికి వస్తూ,పోతూ ఉన్నాడు. తిమ్మప్ప భార్య విజయమ్మ..పెరుమాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే తమ ఆనందానికి భర్త తిమ్మప్ప అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య విజయమ్మ అతడిని అంతమొందించాలని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది.
ఆ ప్లాన్ ప్రకారం పెరుమాళ్ అతని స్నేహితుడు వెంకటాచలపతితో కలిసి గత నెల 29 వ తేదీన తిమ్మప్పను బార్‌కు తీసుకెళ్లి.. అక్కడ మద్యం తెప్పించి, అందులో విషం కలిపి.. తిమ్మప్పతో తాగించారు. మార్గ మద్యంలో విలవిలలాడుతూ తిమ్మప్ప చనిపోగా.. మృతదేహాన్ని టెంపోలో వేసుకొని మాలూరు తాలూకాలోని ఇరబనహళ్లి గేట్ వద్ద ఉన్న నీలగిరి తోపులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రెండు రోజుల నుండి తిమ్మప్ప గురించి సమాచారం లేకపోవడంతో సోదరుడు మహదేవపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తుండగా..మాలూరు పోలీసులకు గురువారం రాత్రి నీలగిరి తోపులో మృతదేహాం ఉన్నట్లుగా సమాచారం అందింది.
అనంతరం మాలూరు పోలీసులు మహదేవపుర పోలీసులకు సమాచారం అందించారు. అతడే తిమ్మప్ప అని తెలియడంతో హత్య కేసు నమోదు చేశారు. మృతుడి భార్య విజయమ్మను పిలిపించి అడగగా ఆమె.. పొంతన లేని సమాధానాలు చెబుతూ వస్తుంది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. విజయమ్మ మెబైల్ కాల్ డేటాపై దృష్టి సారించారు. ఆమె కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా భార్య బండారం బయట పడింది. తమకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు ఒప్పుకుంది.దాంతో, విజయమ్మతో పాటు, పెరుమాళ్, వెంకటాచలపతిలను పోలీసులు అరెస్టు చేశారు.