పెళ్లి చేయాలన్నా, చేసుకోవాలన్న వెయ్యి అబద్ధాలు ఆడాలన్నదీ ఓ సామెత. వెయ్యి ఆడనక్కర్లేదు. కొన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకోవచ్చు అని నిరూపించాడో వ్యక్తి. బురిడీ కొట్టించడంలో పట్టా పొందాడే ఏమో.. అతడిని ఓ అమ్మాయి పెళ్లి చేసుకుంది. అలా ఒకరిని కాదూ.. ముగ్గరు అమ్మాయిలను పడేశాడు.
పెళ్లి చేయాలన్నా, చేసుకోవాలన్న వెయ్యి అబద్ధాలు ఆడాలన్నదీ ఓ సామెత. వెయ్యి ఆడనక్కర్లేదు. కొన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకోవచ్చు అని నిరూపించాడో వ్యక్తి. బురిడీ కొట్టించడంలో పట్టా పొందాడే ఏమో.. కట్నం కోసం అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఒక పెళ్లి అవ్వడమే కష్టంగా మారుతున్న ప్రస్తుత సమాజంలో ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పోనీ సక్రమంగా వారితో కాపురం చేస్తున్నాడా అంటే అదీ లేదు. భార్యను వేధించుకుంటూ తింటున్నాడు. మూడో అమ్మాయి విషయంలో కూడా మిగిలిన ఇద్దరు భార్యల్లా చేద్దామనుకుంటే అతడి పాచిక పారలేదు. మూడో భార్య పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. దీంతో అతడి బంగారం బయట పడింది.
ఇంజనీర్‌నని నటించడమే కాకుండా కట్నం తేవాలంటూ మూడో భార్యను హింసించడంతో పాటు అసభ్యకర వీడియోలు తీసి వైరల్ చేస్తానని బెదిరించాడో భర్త. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.లోయర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంటా టోలిలో నివాసం ఉంటున్న షెహబాన్ షేక్ కుమారుడు జావేద్ అక్తర్ అలియాస్ జావేద్ షేక్ మూడు నెలల క్రితం పాకూర్ జిల్లాలోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మాయిని ఫిబ్రవరి 12న వివాహం చేసుకున్నాడు. ఇంజనీర్‌నని చెప్పి కట్నం కోసం పెళ్లి చేసుకున్నాడు. అత్తగారింటికి చేరుకున్నాక అసలు విషయం తెలిసింది. తాను అతడికి మూడో భార్య అని, అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగి, కట్నం కోసం వారిని కొట్టి ఇంట్లో నుండి గెంటేసినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని నిలదీయగా.. ఆమెను కూడా కట్నం కింద వేధించడం మొదలు పెట్టాడు. ఇవ్వకపోతే భార్య అశ్లీల ఫోటోలను సోషల్ మీడియలో పెడతానని బ్లాక్ మెయిల్ చేయసాగాడు.
పెళ్లైన నాటి నుండి తనకు తెలియకుండా భర్త.. తనకు సంబంధించిన అశ్లీల చిత్రాలను మొబైల్స్ లో తీయడంతో పాటు.. భార్య దగ్గరి బంధువులకు కూడా పంపాడు. కట్నం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిచడంతో.. ఈ మహిళను కూడా కనికరం లేకుండా కొట్టి, ఇంట్లోంచి వెళ్లగొట్టి, డబ్బులు తెచ్చేంత వరకు ఇక్కడికి రావద్దు గెంటేశాడు. నీ అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భర్త జావేద్ షేక్, అతని తండ్రి షాబాన్ షేక్, తల్లి హజ్రా బీవీలపై ఫిర్యాదు చేసింది. పోలీసులకు మొత్తం విషయం చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు.. దాడి, వేధింపులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు నిందితుడైన యువకుడు జావేద్ షేక్‌ను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.