మద్యానికి బానిసైన భర్త నిత్యం తాగొచ్చి భార్యతో గొడవలకు దిగుతుంటాడు. తల్లిదండ్రుల్ని, భార్య, బిడ్డలి పట్ల ఇష్టమొచ్చినట్లు తిడుతుంటాడు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఇస్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఈ పాడు అలవాటు కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతో మంది బిడ్డలు అనాథలుగా అయ్యారు. అయినా
మద్యం పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది. మద్యానికి బానిసైన భర్త నిత్యం తాగొచ్చి భార్యతో గొడవలకు దిగుతుంటాడు. తల్లిదండ్రుల్ని, భార్య, బిడ్డలి పట్ల ఇష్టమొచ్చినట్లు తిడుతుంటాడు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఏదీ మాట్లాడినా తంటే. అయిన దానికి, కానీ దానికి గొడవలే. ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకుని భార్యను చావగొడుతుంటాడు. రోడ్డెక్కి పరువు బజారున పడేస్తాడు. ఈ పాడు అలవాటు కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఎంతో మంది బిడ్డలు అనాథలుగా అయ్యారు. ఈ మద్యం కారణంగా ఎన్నో జీవితాలు తెల్లారిపోయినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు..కదా చివరకూ వారు తాగుడు మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు.
మద్యం మత్తులో భార్యను అతికిరాతకంగా చంపేశాడో కర్కోటకుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డి గూడలో జరిగింది. జనార్థన్, ప్రేమలత భార్యా భర్తలు. జనార్థన్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. గత రాత్రి తూముకుంటలో పెళ్లికి వెళ్లి ఇద్దరు ఇంటికి వచ్చారు. అయితే మద్యం సేవించిన జనార్థన్.. ఆ మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. ఈ గొడవ పెద్దది కాగా, తాగిన మత్తులో, క్షణికావేశంలో భార్యను ఇనుపరాడ్డుతో మోదాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మత్తు దిగాక.. భార్యను చంపేశానని తెలిసి.. అనంతరం జనార్థన్ కూడా తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.