హైదరాబాద్ నగరంలోని తీగల వంతెనపై నుండి ఓ వ్యక్తి నీళ్లల్లోకి దూకేయడం కలకలం రేపింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, గతంలో ఓ మహిళ కూడా ఈ వంతెనపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే.
క్షణికావేశంలో కొంత మంది ఆలోచన కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కారణాలేవైనా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో గొడవలు, ప్రేమ, పెళ్లి విఫలం కావడం, ఆర్థిక పరిస్థితుల వీటికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఉరేసుకోవడం, భవనాల మీద నుండి దూకేయడం వంటి చర్యలకు దిగుతున్నారు. మనస్థాపానికి గురై ఇంట్లో నుండి బయటకు వచ్చి వంతెనలపై నుండి నీళ్లలోకి పడిపోతూ అనాలోచిన చర్యలకు దిగుతున్నారు. హైదరాబాద్ నగరంలోని తీగల వంతెనపై నుండి ఓ వ్యక్తి నీళ్లల్లోకి దూకేయడం కలకలం రేపింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బ్రిడ్జిపై నుంచి వ్యక్తి దూకుతున్న సమయంలో గమనించిన వాహనదారులు కొంత మంది అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను చెరువులోకి దూకేయటంతో.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చెరువులో దూకిన వ్యక్తి కోసం వెతుకుతున్నారు. గత ఈతగాళ్లు రంగంలోకి దింపారు. బోట్ల సాయంతో జల్లెడ పడుతున్నారు. అయితే అతడి ఆచూకీ కానరాలేదని సమాచారం. అతడు చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకటం వెనక కారణాలు ఏమై ఉంటాయనే వివరాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా ఓ మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.